కరాటే కళ్యాణి కి షాక్ ఇచ్చిన మా అసోసియేషన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక విషయం పైన స్పందిస్తూ పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమెను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కరాటే కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లుగా కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది.. సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వాక్యాల పైన వివరాలు ఇవ్వాలంటూ మా అసోసియేషన్ ఈనెల 16వ తేదీన షోకాజ్ నోటీసులను జారీ చేసింది.

Karate Kalyani Suspended From MAA Over NTR Statue Issue
అయితే ఇప్పటివరకు ఈ నోటీసుల పైన ఏ విధంగా స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్ చేసినట్లుగా మా సభ్యులు తెలియజేస్తున్నారు.. మేము పంపించిన షోకాజ్ నోటీసుకు సరైన సమయంలో విచారణను ఫైల్ చేయడంలో మీరు విఫలం అయ్యారు.. ఆ తరువాత లీగల్ నోటీసులు కూడా జారీ చేయక వాటికి కూడా సమాధానం చెప్పలేదు.. మా సభ్యులకు కోసం నిర్దేశించిన ప్రవర్తన నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది.దీనిపై మా అసోసియేషన్ నేడు చర్చించి తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది అంటూ కరాటే కళ్యాణికి ఇచ్చిన నోటీసులు ప్రస్తావించారు.

మరి ఈ విషయంపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.. గత కొద్దిరోజులుగా సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం కృష్ణుడు రూపంలో పోలీ ఉండడంతో కరాటే కళ్యాణి కోర్టుకు వెళ్ళింది.. దీంతో ఆ విగ్రహాన్ని ఆపాలంటూ కోర్టు స్టే ఇచ్చింది అయితే విగ్రహం చేస్తున్న ఎన్నారైలు విగ్రహంలో పలు మార్పులు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 28వ తేదీన ఈ విగ్రహం ఆవిష్కరణ జరగబోతోంది. అందుకే ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు సమాచారం.

Share post:

Latest