అనుష్క ని ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే బెటర్.. ఫ్యాన్స్ లో ఇంతటి భారీ మార్పుకు కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్కల పెళ్లి మేటర్ అనే చెప్పాలి. వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక వార్త రోజు వైరల్ అవుతూనే ఉంటుంది .. ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అయితే వీళ్లు మాత్రం అలాంటి వార్తలు పై స్పందించకుండా తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు . అయితే ఇన్నాళ్లు ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఆశపడిన ఫ్యాన్స్ సైతం మనసు మార్చుకున్నారు .

అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం మంచిది అంటూ ఫైనల్ డెసిషన్ కి వచ్చేసారు . దీనంతటికీ కారణం అనుష్క జాతకంలో ఉన్న దోషమే అంటూ తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అనుష్క జాతకంలో దోషం ఉందని ఆ కారణంగానే ప్రభాస్ ఆమెను పెళ్లి చేసుకోవట్లేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అనుష్క – ప్రభాస్ ల పెళ్లి జరగకూడదు అని అప్పట్లోనే కృష్ణంరాజు ప్రభాస్ అమ్మగారికి గట్టిగా చెప్పుకొచ్చారట .

ఈ కారణంగానే ప్రభాస్ అమ్మగారు కూడా అనుష్క తప్పిస్తే మరి ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న ప్రాబ్లం లేదు అంటూ చెప్పిందట . అయితే మొదటి నుంచి అనుష్క అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రభాస్ ఆమెను తప్పితే వేరే వాళ్ళని చేసుకొని అంటూ భీష్ముంచుకుని కూర్చున్నారు. అంతేకాదు అనుష్క జాతకం ప్రకారం ప్రభాస్ ఆమెని పెళ్లి చేసుకుంటే ఆయనకు ప్రాణగండం ఉందట . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో అనుష్క – ప్రభాస్లపై ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతూ ఉండటం ఎక్కడో ఏదో అభిమానులకు తేడా కొడుతుంది..!!

Share post:

Latest