అనసూయని సుకుమార్ దూరం పెట్టడానికి కారణం అదేనా..? ఆయన చెప్పిన పని చేయలేదా..?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణిస్తున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టు మొహానే మాట్లాడిస్తుంది . ఎవరైనా ట్రోలింగ్ చేస్తే ఇచ్చి పడేస్తుంది . తప్పు చేస్తే తిట్టడం..మంచి పని చేస్తే చప్పట్లు కొట్టడం.. అనసూయ కి పుట్టుకతో వచ్చిన విద్య అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో అనసూయ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే .

ఏ ముహూర్తాన జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో అమ్మడుని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . రీసెంట్ గానే ఆంటీ ఆంటీ అంటూ ఎంత పెద్ద బూతు పదాలను ఆమెపై వాడారో మనకు తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే ఆమె సినిమా అవకాశాలు మిస్ చేసుకుంటుందని పుష్ప2 సినిమాలో కూడా ఆమె పాత్ర తగ్గిపోయింది అని చెప్పుకొచ్చారు జనాలు. కాగా ఇలాంటి క్రమంలో నే ఆమెకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతుంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాలో అనసూయ పాత్ర చాలా వరకు తగ్గించడానికి కారణం అనసూయ కి ఉన్న హెడ్ వెయిట్ అంటూ చెప్పుకొస్తున్నారు కొందరు ఫ్యాన్స్ . ఆమెను టంగ్ కంట్రోల్ లో పెట్టుకోమని సుకుమార్ మొదటి నుంచి సజిస్ట్ చేస్తున్నారట . ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉన్న హీరోయిన్స్ ఎదగగలరు అంటూ ఆమెకు సజెస్ట్ చేస్తూ వచ్చారట . అయితే సుకుమార్ మాటలను కూడా వినకుండా అనసూయ ఫుల్ రెచ్చిపోయి మాట్లాడేసిందని .. ఆ కారణంగానే సుకుమార్ అప్పట్నుంచి ఆమెను దూరం పెడుతూ వచ్చాడు అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే అనసూయ ఖాతాలో కొన్ని సినిమాలు ఉన్న బిగ్ బిగ్ సినిమాలను మిస్ చేసుకుంటూ ఉండడం ఆమె కెరియర్ కి బిగ్ మైనస్ గా మారింది. ఈ క్రమంలోనే సుకుమార్ ను అనసూయ డిసప్పాయింట్ చేసింది అన్న న్యూస్ మరోసారి వైరల్ గా మారింది..!!

Share post:

Latest