లేటు వయసులో ఘాటు ప్రేమ.. 60 ఏళ్ల వయసుల్లో పెళ్ళి చేసుకున్న స్టార్ నటుడు..!!

ప్రేమ .. ఎప్పుడు.. ఎవరికీ ఎలా పడుతుందో ఎవ్వరు చెప్పలేరు . అది ఎవరికీ సాధ్యం కానీ పని. అయితే ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే ముసలి వాళ్ళు సైతం లేటు వయసులో ఘాటుగా ప్రేమాయణం నడుపుతూ పెళ్లి కూడా చేసుకుంటున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయారు స్టార్ నటుడుగా పేరు సంపాదించుకున్న ఆశిష్ విద్యార్థి . 2000 సంవత్సరంలో “పాపే నా ప్రాణం” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు .

దాదాపు 11 భాషలలో వందలాది సినిమాలు చేసిన ఈనెల 20 ఏళ్ల క్రితం బెంగాలీ నటి రోజూషిని పెళ్లి చేసుకున్నారు . వీళ్లిద్దరికి ఓ బాబు కూడా ఉన్నారు . అయితే కొన్ని అభిప్రాయ భేదాలు కారణంగా వీరిద్దరు విడిపోయారు . అప్పటినుంచి సింగిల్గానే లైఫ్ నీ ఎంజాయ్ చేస్తున్న ఈయన రీసెంట్గా అస్సాం కు చెందిన రూపాలీ బోసు అనే మహిళను మరోసారి ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి చాలా సింపుల్గా ఈనెల 25న జరిగింది . అతి కొద్ది మంది స్నేహితులు ..బంధువుల సమక్షంలో పెళ్లి జరగడం గమనార్హం.

అందుతున్న సమాచారం ప్రకారం ఆశిష్ విద్యార్థి వయసు 60 ఏళ్లు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నాడు ఆశిష్ విద్యార్థి. 60 ఏళ్ల వయసులో ఘాటు ప్రేమాయణం నీకు అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకొని అభిమానులకి షాక్ ఇచ్చాడు ఆశిష్ విద్యార్థి . ఆశిష్ తెలుగు – తమిళం – కన్నడం – మలయాళం – హిందీ – భోజ్పురి – కన్నడ భాషలలో సుమారు 350 సినిమాలకు పైగానే నటించారు . ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఈ న్యూస్ పాన్ ఇండియా వైడ్ లో ట్రెండ్ అవుతుంది..!!

Share post:

Latest