మహేష్ బాబు అన్న మరణానికి కారణం ఇదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో హీరోలు ఎంతటి పేరు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ నటనతో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నారో తెలిసిందే ..ఆయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన ఆయన కుమారుడు రమేష్ బాబు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో చిత్రాలను నిర్మించారు. రమేష్ బాబు ఆ స్టార్ హీరోల వల్ల నరకం చూశారని సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో హాజరై పలు విషయాలను తెలిపారు.

Mahesh Babu's elder brother, actor-producer Ramesh Babu passes away at 56

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అభివృద్ధి పనులు కూడా ఎక్కడ ఎక్కువగా జరగడం లేదని కృష్ణ గారు తనతో చెప్పారని ఆదిశేషగిరిరావు మీడియా సందర్భంగా తెలిపారు.. ఇకపోతే రమేష్ బాబు గురించి మాట్లాడుతూ ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో హిట్లున్నాయి.. అయితే అలా ఎన్ని హిట్లు ఉన్నా సరే బాలయ్య ,వెంకటేష్ లాగా తాను ఎదగలేకపోయానని రమేష్ బాబుకు చాలా బాధగా ఉండేదట. ఆ బాధతో తాను కొన్నాళ్లపాటు నరకాన్ని కూడా అనుభవించారని తెలిపారు.

ఇక ఆ బాధను భరిస్తూ ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఈయన చివరిగా గత ఏడాది జనవరిలో గుండెపోటుతో మరణించారు అంటూ ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ కూతురు మంజుల కూడా ఇండస్ట్రీ నుంచి దూరం కావడానికి పలు కారణాలను కూడా తెలిపారు. సౌత్ ఇండస్ట్రీలో సినీ కుటుంబం నుంచి ఆడవాళ్లు ఇండస్ట్రీలోకి వస్తే ప్రేక్షకుల నుంచి తప్పక వ్యతిరేకత ఏర్పడుతుంది. అందుకే మంజుల ఇండస్ట్రీ వైపు అడుగులు వేయలేదని తెలిపారు.

Share post:

Latest