తెలుగు సినీ ఇండస్ట్రీలో సహజ నటిక పేరు పొందింది హీరోయిన్ జయసుధ. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. హీరో జేడీ చక్రవర్తి రాంగోపాల్ వర్మ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈయన ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమాలలో కనిపించలేదు. అప్పట్లో హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ రచయితగా స్క్రీన్ ప్లే ఇలా అన్నీ కూడా జెడి చక్రవర్తి చాలా గొప్పగా రాణించేవారు.
జెడి చక్రవర్తి నటించిన కొన్ని చిత్రాలలో మనీ మనీ, గులాబి ,బొంబాయి ప్రియుడు, దేయ్యం ఇలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి బాగా పేరు సంపాదించారు.ముఖ్యంగా సత్య సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిందని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించిన జెడి చక్రవర్తి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.
ఆ తర్వాత తన దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా హోమం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వర్మ కూడా ఈయన శిష్యుడు కావడంతో వీరిద్దరి మేకింగ్ స్టైల్ కూడా కాస్త పోలి ఉంటుందని చెప్పవచ్చు. అప్పట్లో రాంగోపాల్ వర్మ నేను జయసుధ అని ప్రేమించానని ఇంటర్వ్యూలో చెప్పేవారు. జెడి చక్రవర్తి కూడా ఇంటర్వ్యూలో అలాగే చెప్పేవారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన మీ గురువు రాంగోపాల్ వర్మ గారిలాగే మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా అంటూ అడగగా.. అందుకు జెడి చక్రవర్తి సమాధానం చెబుతూ ఈ ప్రపంచంలో జయసుధ గారిని శ్రీదేవి గారిని మేమిద్దరం మాత్రమే ఇష్టపడ్డామా ..మిగతావాళ్లంతా ఇష్టపడడం లేదా .. మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటూ తెలిపారు. ఇక తర్వాత జీడి చక్రవర్తి చెప్పిన సమాధానాలతో యాంకర్ ఒక్కసారిగా దండం పెట్టి నవ్వేసింది యాంకర్.