మహానాడు టీడీపీకి కలిసొస్తుందా?

మహానాడు..తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటి కార్యక్రమం..ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఈ మహానాడు కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేసుకుంటారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత..కోవిడ్ వల్ల మహానాడు జరుపుకోలేదు. కానీ గతేడాది మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలులో భారీ స్థాయిలో జరుపుకున్నారు. ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి టి‌డి‌పి శ్రేణులు తరలివచ్చాయి. కార్యక్రమాన్ని ఫ్లాప్ చేయాలని వైసీపీ తన అధికార బలాన్ని మొత్తం ఉపయోగించింది..అయినా సరే మహానాడు సక్సెస్ ఔయింది.

ఇక ఇప్పుడు ఎన్నికల ముందు జరగనున్న మహానాడు కార్యక్రమంపై అందరి దృష్టి ఉంది. 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఫెయిల్ చేయాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. మహానాడుకు బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటుంది. సరే వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన..కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టి‌డి‌పి శ్రేణులు చూస్తున్నాయి. అయితే ఈ మహానాడు అనేది టి‌డి‌పికి భవిష్యత్ ఎలా ఉంటుందో డిసైడ్ చేసేది అని చెప్పవచ్చు.

ఎన్నికల ముందు జరగనున్న ఈ మహానాడుతో టి‌డి‌పికి మరింత ఊపు వస్తే..ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ మహానాడు అనుకున్న మేర సక్సెస్ కాకపోవడం, నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పికి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఎదురైనా..ఆ పార్టీకే రిస్క్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ గాని టి‌డి‌పి గెలవకపోతే..ఆ పార్టీ భవిష్యత్ ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ..టీడీపీని ఎన్ని రకాలుగా అణిచివేయాలో అన్నీ రకాల ప్రయత్నాలు చేసింది.

నెక్స్ట్ కూడా టి‌డి‌పి అధికారంలోకి రాకపోతే..ఇంకా ఆ పార్టీ పరిస్తితి దారుణంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టి‌డి‌పి అధికారంలోకి రావడానికి ఇప్పుడు మహానాడు పునాది వేయనుంది. మహానాడు భారీ స్థాయిలో సక్సెస్ అయితే..ఆ  పార్టీకి మరింత అడ్వాంటేజ్.