బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని చేతులారా వ‌దులుకున్న అనుప‌మ‌.. ద‌ర‌దృష్టం అంటే ఇదే!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు గ‌త‌ ఏడాది బాగా కలిసి వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2, బ‌ట‌ర్ ఫ్లై, 18 పేజెస్ చిత్రాలు మంచి విజ‌యం సాధించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ప‌డ‌టంతో అనుప‌మ ద‌శ తిరిగిన‌ట్లే అని అంద‌రూ అనుకున్నారు. కానీ, కెరీర్ ప‌రంగా అనుప‌మ అనుకున్నంత జోరు చూపించ‌లేక‌పోతోంది.

ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో అడ‌పా త‌డ‌పా చిత్రాలు చేస్తున్న అనుప‌మ ప‌రిమేశ్వ‌ర‌న్‌.. రీసెంట్ గా ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని చేతులారా వ‌దులుకుంద‌ట‌. ఇంత‌కీ ఈ సినిమా మ‌రేదో కాదు.. `విరూపాక్ష‌`. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీన‌న్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. మిస్టరీ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఈ సినిమాలో సంయుక్త‌ పాత్రకు చక్కటి ప్రాధాన్యత లభించింది. అయితే నిజానికి మొదట ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ ను అనుకున్నారట. సాయి ధరమ్ తేజ్ కి అనుప‌మ‌తో మంచి సన్నిహిత్యం ఉన్న కారణంగా ఆమె పేరును సూచించాడట. దాంతో మేకర్స్ అనుప‌మ‌ను సంప్రదించ‌గా.. ఆమె ఓ మలయాళం మూవీ తో బిజీగా ఉండటం వల్ల సున్నితంగా రిజెక్ట్ చేసిందట. తర్వాత సంయుక్తకు విరూపాక్ష‌లో నటించే అవకాశం ల‌భించింది. ఒకవేళ అనుపమ విరూపాక్ష చేసి ఉంటే ఆమె ద‌శ ఇప్పుడు మరోలా ఉండేది. కానీ దురదృష్టం కొద్దీ అనుపమ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని చేతులారా వ‌దులుకుంది.

Share post:

Latest