అమరావతితో బీజేపీకి బెనిఫిట్..వైసీపీకి రివర్స్!

ఏపీలో ఏదొక విధంగా బలపడాలనే దిశగానే బీజేపీ ముందుకెళుతుంది..కానీ ప్రజలు ఎక్కడా కూడా బి‌జే‌పికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది..దీంతో ప్రజలు బి‌జే‌పికి మద్ధతు ఇవ్వడం లేదు. కాకపోతే ఏదో రకంగా బీజీపీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఇదే క్రమంలో అమరావతి విషయంలో బి‌జే‌పి మద్ధతు పలికిన విషయం తెలిసిందే.

జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా బి‌జే‌పి అమరావతి నినాదం అందుకుంది. రాష్ట్రంలో టి‌డి‌పితో సహ అన్నీ విపక్ష పార్టీలు అమరావతికి మద్ధతు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో అమరావతికి బి‌జే‌పి మద్ధతు తెలిపే విషయంలో కాస్త వెనుకడుగు వేసింది. కానీ తర్వాత అమరావతికి మద్ధతు ఇచ్చింది. ఇదే క్రమంలో తాజాగా అమరావతి ఉద్యమానికి 1200 రోజులు అయిన సందర్భంగా అన్నీ పార్టీల నేతలు అమరావతి రైతులకు మద్ధతు తెలిపారు. ఇదే క్రమంలో బి‌జే‌పి నేతలు సైతం అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు.

ఇదే క్రమంలో బి‌జే‌పి జాతీయ నేత సత్యకుమార్ పై వైసీపీ శ్రేణులు దాడులు చేయడం సంచలనంగా మారింది. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు..సత్యకుమార్ కారుపై దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ దాడిని అన్నీ ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. అయితే పోయి పోయి వైసీపీ..బి‌జే‌పితో పెట్టుకుందని, ఇకపై వైసీపీకి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే జాతీయ స్థాయిలో బి‌జే‌పితో జగన్ సఖ్యతగా ఉంటున్నారు. ఇటు రాష్ట్రంలో కూడా బి‌జే‌పి నేతలు..జగన్ కు అనుకూలంగా ఉంటున్నారనే వాదనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో బి‌జే‌పి నేత సత్యకుమార్ పై దాడి జరగడం వైసీపీకి ఇబ్బందే అని చెప్పవచ్చు.