అసలు బుద్ధుందా..? పూర్ణ చేసిన ప‌నికి మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ పూర్ణ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు హీరోయిన్ గా, మ‌రోవైపు స‌హాయ‌క న‌టిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌.. గ‌త ఏడాది దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

పెళ్లి చేసుకున్న కొద్ది నెల‌ల‌కే గ‌ర్భం దాల్చిన పూర్ణ త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. రీసెంట్ గా పూర్ణ సీమంతం వేడుక‌ల ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌స్తుతం తొమ్మిది నెల‌ల గ‌ర్భ‌వ‌తి అయిన పూర్ణ నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గురైంది. అస‌లేం జ‌రిగిందంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తాజాగా `ద‌స‌రా`లోని పాపుల‌ర్ సాంగ్ `చమ్కీల అంగీలేసి`కి డ్యాన్స్ చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే ఈ వీడియో చూసిన ప‌లువురు నెటిజ‌న్లు అసలు బుద్ధుందా నీకు.. అంటూ పూర్ణపై మండిప‌డుతున్నారు. నిండు గర్భ‌ణీలు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో తెలియ‌దా.. ఇలా డ్యాన్స్ చేస్తారా..? అంటూ పూర్ణ‌కు చుర‌క‌లు వేస్తున్నారు. కాగా, ద‌స‌రా సినిమాలో పూర్ణ కూడా న‌టించింది. ఆమె విల‌న్ భార్య‌గా మెరిసింది.

https://www.instagram.com/reel/Cqc-zWpB2tB/?utm_source=ig_web_copy_link