పుష్ప చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సుకుమార్..!!

అల్లు అర్జున్, సుకుమార్ కలయిక లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ చిత్రం 2021 లో విడుదలై భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ ని అందుకొని ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్టైల్ ,డైలాగ్స్ ,మేనరిజం ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమస్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అంటూ డైలాగ్ బాగా పాపులారిటీ సంపాదించింది. దీంతో ఇతర భాషలలో కూడా ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది.

Allu Arjun promises a 'memorable' film with Pushpa, says 'Bohot shukriya'  to Hindi fans for watching his movies | Entertainment News,The Indian  Express

పుష్ప సినిమా సీక్వెల్ గా పుష్ప -2 గా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం కూడా మొదటి భాగాన్ని మించి ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ అయినా కూడా విడుదల చేయలేదు చిత్ర బృందం.దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పుడు వారందరినీ ఆనందపరుస్తూ సుకుమార్ ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.. ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఆ రోజున గ్లింప్స్ లేదా టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొదటి భాగాన్ని ఎన్నో అంచనాల సృష్టించిన పుష్పరాజు చిత్రం పార్ట్ తో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తారు చూడాలి మరి.ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తూ ఉన్నారు. విధంగా ఫహద్ ఫాజీల్ నటిస్తూ ఉన్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు.. ట్విట్టర్ నుంచి పుష్ప అప్డేట్.. రూలింగ్ సూన్ పుష్ప ది రూల్ అంటూ ఒక అప్డేట్ ను విడుదల చేయడం జరిగింది.

https://twitter.com/PushpaMovie/status/1641763694878269448?s=20