అలాంటి ఘనత అందుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు…ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇప్పుడు తీసిన RRR సినిమా ఇంకొక ఎత్తు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది.మొన్నటికి మొన్న నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాకుండా ప్రేక్షకుల పొగడ్తలను కూడా అందుకుంటున్నారు జక్కన్న. అందుకే ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన 2023 మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకున్నాడు.

SS Rajamouli answers if he is 'supporting the BJP' with his films:  'Sometimes Muslims have had objections, sometimes Hindus' | Entertainment  News,The Indian Express
అయితే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చి ఆ జాబితాలో చోటును దక్కించుకున్న ఒకే ఒక్క వ్యక్తి రాజమౌళి. ఈ జాబితాలో రాజమౌళిది 95వ స్థానం ఈ జాబితాలో మొదటి స్థానంలో ప్రధాని నరేంద్ర దక్కించుకున్నారు. తర్వాత స్థానంలో అమిత్ షా ఉన్నారు. వీరే కాకుండా డివై చంద్ర చూడ్.. ఎస్ జయశంకర్.. మోహన్ భగవత్.. అజిత్ దోవల్ టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది 51 వ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ప్రభావము ఏమో కానీ ఈసారి 15వ ర్యాంకులో నిలిచాడు.

RRR' dir Rajamouli thanks NY Film Critics Circle for recognising 'small  film from south of India'

ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ జాబితాలో 58వ ర్యాంకు దక్కించుకున్నారు. ఇక స్టార్ క్రికెటర్ అయినా విరాట్ కోహ్లీ 53వ స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 83వ ర్యాంకు దక్కించుకున్నాడు.

బాలీవుడ్ స్టార్స్ జాబితా లిస్ట్ కొస్తే షారుక్ ఖాన్ 50వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అమితాబచ్చన్ 87వ స్థానం.. దీపికా పడుకొనే 93వ స్థానం ఆలియా భట్ 99వ స్థానం బాలీవుడ్ యంగ్ హీరో రన్వీర్ సింగ్ 100వ స్థానంలో ఉన్నారు. రాజమౌళి మాత్రం 95 స్థానంలో నిలిచి టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి గుర్తింపును సంపాదించాడనే చెప్పాలి. ఏదేమైనా RRR సినిమా ద్వారా రాజమౌళికి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.