అమరావతిలో మరొక  పోరు..జగన్ స్కెచ్ అదిరింది.!

అమరావతిపై రాజకీయం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఏమో అమరావతిని దెబ్బతీయాలని, టి‌డి‌పి ఏమో అమరావతిని రాజధానిగా ఉంచాలని..ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇప్పటికే మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ..అమరావతిని ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసింది. కానీ అమరావతి కోసం అక్కడ ప్రజలు, ప్రతిపక్షాలు పోరాడుతూనే ఉన్నాయి.

ఇక ఏదొక విధంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టి, అమరావతిని నిలువరించాలనేది వైసీపీ కాన్సెప్ట్. అయితే ఇప్పటికే వైసీపీ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో అమరావతిలో జగనన్న కాలనీల పేరిట..అటు గుంటూరు, ఇటు విజయవాడలకు చెందిన కొందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనిపై అమరావతి ప్రజలు పోరాడుతున్నారు. రాజధాని కోసమని ఇచ్చిన భూములని ఇళ్ల పట్టాలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇటు వైసీపీ ఏమో పేదలకు పట్టాలు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ రాజకీయం వేరు..అక్కడ పట్టాలు ఇచ్చి..కాలనీలు ఏర్పాటు చేస్తే కొత్త ఓటర్లు వస్తారని, దాని ద్వారా తాడికొండ నియోజకవర్గంలో లబ్ది పొందాలనేది వైసీపీ ఎత్తు. అలాగే పట్టాలు ఇచ్చి రాజకీయంగా పైచేయి సాధించాలని చూస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలని అమరావతి రైతులు భావిస్తున్నారు. అమరావతి పరిధిలో స్థానికేతురలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరుతో ప్రభుత్వం విధ్వసంనానికి కుట్ర చేస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఈ నెల 24న ఆర్ -5 జోన్ పరిధి ప్రాంతాల్లో పాదయాత్రకు నిర్ణయించింది. అలాగే బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఇలా అమరావతిలో రచ్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది. దీన్ని కవర్ చేసుకోవాలని వైసీపీ చూస్తుంది..స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి..అక్కడ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తుంది. చూడాలి మరి ఈ అంశంలో ఏం జరుగుతుందో.