ఏఎన్ఆర్ – ఎన్టీఆర్ మధ్య అంత స్నేహబంధం ఉండేదా..!!

ఈ తరం స్టార్ హీరోలలో కొంతమంది మాత్రమే స్నేహంగా కనిపిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఈగోల కారణంగా మల్టీ స్టార్ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కానీ ఒకప్పుడు హీరోలు మాత్రం ఏడాదికి కనీసం నాలుగైదు అయిన మల్టీ స్టార్ సినిమాలలో నటించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు మల్టీ స్టార్ చిత్రాలలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన రామకృష్ణుడు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 1978 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా వెనక కథ తెలిస్తే వీరిద్దరి మధ్య స్నేహం ఎంతగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు.

anr and ntr • ShareChat Photos and Videos
అసలు విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ ఒకసారి ఏఎన్ఆర్ తో తన వద్ద రెండు స్క్రిప్టులు ఉన్నాయి వాటిలో నచ్చిన దాన్ని ఎంచుకొని నటించమని చెప్పారట. అందులో ఏఎన్ఆర్ చాణక్య చంద్రగుప్త స్క్రిప్ట్లను ఎంపిక చేసుకున్నారు.. అందులో చాణిక్యుని పాత్రను ఏఎన్ఆర్ పోషించాక చంద్రగుప్తుని పాత్రలో ఎన్టీఆర్ నటించారు. దీంతో దర్శకత్వం కూడా ఎన్టీఆర్ వహించి నిర్మించారు కూడా. చాణక్య చంద్రగుప్త సినిమాలో నటించినందుకు ఏఎన్ఆర్ కు కృతజ్ఞతగా ఎన్టీఆర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై ఒక సినిమాను నిర్మించేందుకు ఎన్టీఆర్ డేట్లు కూడా ఇచ్చారట.

Bhanumathi Ramakrishna. - With NTR & ANR... | Facebook

అయితే ఆ డేట్లు ఎలా వినియోగించుకోవాలని ఏఎన్నార్ చూస్తున్న సమయంలో ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ వచ్చారట.జగపతి ఆర్ట్స్ పిక్చర్లు ఏఎన్ఆర్ ను నటించాల్సిందిగా అడిగిన సమయంలో రాజేంద్రప్రసాద్ మిత్రుడు కూడా కావడంతో ఎక్కువ లాభాలు రావాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసుకున్నారట. అలా ఇద్దరు కలిసి నటించిన చిత్రమే రామకృష్ణుడు ఈ సినిమా నిర్మాణ భాగస్వామిని అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఉన్నది.. తన సినిమాలో నటించాడని ఉద్దేశంతో పారితోషకం తక్కువైనా కూడా ఎన్టీఆర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పైన నటించడానికి ఓకే చెప్పారు.. ఇది ఎన్టీఆర్ ఏఎన్నార్ యొక్క స్నేహ బంధానికి నిదర్శనం అని చెప్పవచ్చు.