నాగదోషం వ‌ల్లే ఫ్లాపులు.. అఖిల్ జాత‌కం మారాలంటే అదొక్క‌టే మార్గం అట‌!

అక్కినేని ఫ్యామిలీతో మూడో త‌రం హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్‌. అయితే ఆరంభం నుంచి ఈయ‌న కెరీర్ అంత సాఫీగా సాగ‌డం లేదు. కెరీర్ ఆరంభంలోనే అఖిల్, హలో, మిస్టర్ మజ్ను రూపంలో హ్యాట్రిక్ ఫ్లాపులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వ‌చ్చిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీతో అఖిల్ తొలిసారి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు.

 

అయితే ఈ సినిమా అఖిల్ రేంజ్ హిట్ కాద‌నే చెప్పాలి. ఇక ఈ అక్కినేని హీరో ఎంతో న‌మ్మ‌కంగా చేసిన చిత్రం `ఏజెంట్‌`. అఖిల్ కెరీర్ లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నిన్న విడుద‌లై డిజాస్ట‌ర్ టాక్ ను అందుకుంది. అఖిల్ ఈ మూవీ కోసం ఎంత‌గానో శ్ర‌మించినా.. ఆయ‌న క‌ష్టం బూడిద‌లో పూసిన ప‌న్నీరే అయింది. ఇదిలా ఉంటే.. ఫ్లాపుల నేప‌థ్యంలో అఖిల్ జాత‌కం నెట్టింట వైర‌ల్ గా మారింది.

పాపుల‌ర్ జ్యోతిష్యుడు వేణు స్వామి అఖిల్ జాత‌కంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని, దాని ప్ర‌భావం చాలా ఎక్కువ ఉంద‌ని వేణు స్వామి పేర్కొన్నారు. ఆ దోషం ఉన్నప్పుడు ఇతరుల సలహాలు మిస్ ఫైర్ అవుతాయి అని వేణు స్వామి తెలిపారు. కాబ‌ట్టి, అఖిల్ హిట్ కొట్టాలంటే ఒక్కటే మార్గం ఉంద‌ట‌. అఖిల్ సినిమాల విషయంలో ఎవరి ప్రభావం ఉండకూడద‌ని, తన సొంత నిర్ణయాలతోనే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని సినిమాలు చేయాల‌ని, అప్పుడే స‌క్సెస్ వ‌రిస్తుంద‌ని వేణు స్వామి సూచించారు.

Share post:

Latest