కొడుకు పై ట్రోలింగ్..చిర్రెత్తిపోయిన అమల స్ట్రైట్ వార్నింగ్..పోస్ట్ వైరల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని అఖిల్ పై హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడమే అంటూ తెలుస్తుంది . అఫ్కోర్స్ గతంలో కూడా అఖిల్ పై ట్రోలింగ్ జరిగేది.. బండ బూతులు తిట్టేవాళ్ళు . కానీ ఈసారి దానికు మించిన డబుల్ రేంజ్ లో అక్కినేని పర్సనల్ విషయాలను కూడా బయట పెడుతూ హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తూ ఉండడంతో.. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అక్కినేని అఖిల్ వాళ్ళ అమ్మగారు అమల ఫస్ట్ టైం సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అక్కినేని అమల ట్రోలర్స్ కు ఇచ్చి పడేసింది . మరీ ముఖ్యంగా ఎవరైతే తన కొడుకుని ట్రోల్ చేస్తున్నారో.. వాళ్ళకి ఘాటుగా ధీటైనా కౌంటర్ వేసింది . ఈ క్రమంలోనే అక్కినేని అమల పోస్ట్ చేస్తూ..” ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామన్ గా మారిపోయింది. ఏ విషయంలోనైనా సరే ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు . నేను నిన్ననే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చూశాను. సినిమా చాలా బాగుంది “.

“ఓపెన్ మైండ్ తో చూస్తే అందరికీ నచ్చుతుంది. అఫ్కోర్స్ సినిమాలో నెగిటివ్స్ ఉన్నాయి ..కానీ ఏదైనా మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. నేను వెళ్ళిన థియేటర్స్ లో సగానికి పైగా లేడీస్ ఉన్నారు. అమ్మలు – అమ్మమ్మలు -తండ్రులు -తాతలు అందరూ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు ..నవ్వుకుంటున్నారు.. యాక్షన్ సీన్స్ లో చప్పట్లు కొడుతున్నారు ..ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది “అంటూ అక్కినేని అఖిల్ ని ట్రోల్ చేసే వాళ్లకు ఘాటుగా ఇచ్చి పడేసింది అక్కినేని అమల .

 

 

View this post on Instagram

 

A post shared by Amala Akkineni (@akkineniamala)

 

Share post:

Latest