“ఎన్నో సార్లు బాత్ రూమ్ లో కూడా అలా చేశా”.. ఓపెన్ అప్ అయిన ప్రియాంక చోప్రా..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా .. ప్రెసెంట్ గ్లోబల్ బ్యూటీగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా రికార్డు నెలకొల్పిన ప్రియాంక చోప్రా ..హాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ తన పేరు ఇంకా ముందుకు తీసుకెళ్తుంది . అంతేకాదు ప్రెసెంట్ ప్రియాంక చోప్రా స్టేటస్ ఎలా ఉందో మనందరికీ బాగా తెలిసిందే..

అయితే ఒకప్పుడు ప్రియాంక చోప్రా బాత్రూంలో ఫుడ్ తినింది అన్న విషయాన్ని ఇన్నాళ్లకు బయటపెట్టింది ప్రియాంక. ఎస్ ప్రియాంక చోప్రా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన బాల్యంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా మాట్లాడుతూ ..”కెరియర్ స్టార్టింగ్ లో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను ..మరి ముఖ్యంగా అమెరికాకి వెళ్ళిన కొత్తల్లో నాకు ఎలా అందరితో మెలగాలో తెలియలేదు.. ఎవరితో మాట్లాడాలో ..ఎలాంటి ఫుడ్ తినాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో ..నాకు అస్సలు తెలియలేదు”.

“ఈ క్రమంలోనే క్యాంటీన్ కి వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో నాకు తెలియక.. వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకొని ఎవ్వరూ చూడకుండా బాత్రూంలోకి వెళ్లి తినేసి అక్కడే టిష్యూస్ వేసేసి ..ఆ తర్వాత క్లాస్ కి వెళ్ళాను ..అలా చాలా రోజులు గడిపాను ..నాకున్న భయంతో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఆ తర్వాత కొన్ని రోజులకి పరిస్థితులు చక్కబడ్డాయి ….ఆ తర్వాత నన్ను నేనే మార్చుకుంటూ.. అందరితో మింగిల్ అయ్యాను.. కొంచెం ధైర్యం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నా పనులు నేనే చేసుకుంటూ వచ్చాను. ప్రెసెంట్ ఈ పొజిషన్లో ఉన్నాను ” అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా . ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ కి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే సరోగసి ద్వార బిడ్డను కూడా కన్నేసింది..!!

 

Share post:

Latest