ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ..మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ..మరోసారి మహేష్ బాబుతో జతకట్టబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే “సర్కారు వారి పాట” అనే సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు కలిసి నటించారు .
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. పరశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది . ఈ సినిమాతోనే కీర్తి సురేష్ తనలోని బోల్డ్ యాంగిల్ ను బయటపెట్టింది. మరోసారి మహేష్ బాబు – కీర్తి సురేష్ కలిసి నటిస్తున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు . అయితే ఇది కేవలం ఒక పది నిమిషాల పాత్ర మాత్రమే అని తెలుస్తుంది.
10 నిమిషాల రోల్ లో కూడా కీర్తి – మహేష్ పిచ్చ కామెడీని పండిస్తారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కధ అనుసారంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ 10 నిమిషాల పాత్ర కోసం త్రివిక్రమ్ అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా ఓకే చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే మరోసారి తెరపై మహేష్ బాబు – కీర్తి సురేష్ లను జంటగా చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..!!