కొడుకుల విషయంలో నాగార్జున చిరంజీవి మధ్య తేడా ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా హీరోల వారసత్వం కొనసాగుతూనే ఉంది. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమాతో తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.

Chiranjeevi and Ram Charan plan to compensate investors for 'Acharya'  losses - Telangana Today
అయితే చిరంజీవి రాంచరణ్ కెరియర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని రాజమౌళితో సినిమాని తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన ప్రతి సినిమా కథను కూడా తెలుసుకొని కథలు కొన్ని మార్పులు సూచించి సినిమాలను తెరకెక్కిస్తూ ఉండేవారట దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదగడానికి చిరంజీవి చాలా కృషి చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ క్లాపుల్లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్ పైన ప్రభావం పెద్దగా చూపించలేదని అందుకు తగ్గ ప్లాన్ కూడా చిరంజీవి వేస్తూ ఉండే వారిని సమాచారం.

PHOTOS: Nagarjuna and sons Naga Chaitanya, Akhil Akkineni are the best  terrific trio from Tollywood | PINKVILLA
నాగార్జున మాత్రం తన కొడుకుల కెరియర్ విషయంలో పెద్దగా పట్టించుకోరని కెరియర్ మొదట్లో నాగచైతన్యకు జోష్ దడ బెజవాడ వంటి సినిమాలతో భారీ డిజాస్టర్లు తగిలాయి. కానీ ఆ తర్వాత క్లాస్ సినిమాలతో పర్వాలేదు అనిపించుకున్నారు.అఖిల్ కెరియర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మరే సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. నాగార్జున కొడుకుల కెరియర్ పై ఫోకస్ పెడితే బాగుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి ఇకనైనా జాగ్రత్త పడతారేమో చూడాలి మరి.