సమంత లైఫ్ లో మళ్ళీ గోల్డెన్ డేస్ రాబోతున్నాయా..? అభిమానులకు కొత్త ఊపునిస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో కొట్టుమిట్టాడుతుందో మనందరికీ తెలిసిందే . ఆరోగ్యం బాగోలేక కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ కమిట్ అయిన సినిమాలను రీ షెడ్యూల్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది . అయితే సమంత ఎంతో ఆశగా భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవ్వడంతో సమంత లైఫ్ టోటల్ టర్న్ అయిపోయింది .

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా రికార్డ్ నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే సమంత తన ఆశలన్నీ నెక్స్ట్ చేస్తున్న సినిమా పైన పెట్టుకుంది . శివనిర్వాణ డైరెక్షన్లో హీరోగా విజయ్ దేవరకొండ – హీరోయిన్గా సమంత చేస్తున్న సినిమా ఖుషి . ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది .

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే సమంత చాలా స్మైలీ హోమ్లీ లుక్స్ లో కనిపించింది . అంతేకాదు ఈ పోస్టర్ చూసిన తర్వాత అచ్చం “ఏం మాయ చేసావే” సినిమాలో సమంత లాగే ఉన్నావు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతే కాదు ఫేస్ లో ఆ నవ్వులు అన్ని చూస్తుంటే సమంత లైఫ్ లో మళ్ళీ గోల్డెన్ డేస్ రాబోతున్నాయని ..ఈ సినిమా హిట్ అయితే సమంత టోటల్ ఫేట్ మారిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోని ఈ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు సమంత అభిమానులు..!!

Share post:

Latest