ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాలు ఎక్కువగా ఉంటున్నాయి . ఒకప్పుడులా ఒక హీరో సినిమాలో మరో హీరో నటించాలి అంటే ఫీల్ అవ్వట్లేదు..షై ఫీలింగ్ ఉండట్లేదు .. జాలీగా ..ఫ్రెండ్లీగా ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు . ఫ్యాన్స్ కి కూడా ఇలాంటి మూవీస్ బాగా నచ్చుతున్నాయి..సో ఎంకరేజ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే డైరెక్టర్ లు కూడా ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు . ఈ క్రమంలోనే కొందరు డైరెక్టర్ లు స్టార్ హీరో సినిమాలలో యంగ్ హీరోస్ ను గెస్ట్ రోల్గా పిలిపించి అభిమానులకు కొత్త బూస్టప్ ఇస్తున్నారు .
ఈ క్రమంలోనే బాలయ్య కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్బికె 108 సినిమాలో నాచురల్ స్టార్ హీరో నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే నాచురల్ స్టార్ హీరో నాని బాలయ్యకు డై హార్ట్ ఫ్యాన్. తన సినిమాల్లో ఎన్నోసార్లు బాలయ్య డైలాగ్స్ వాడుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గానే చెప్పాడు .
ఇదే క్రమంలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న సినిమాలో నాని గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . కేవలం 10 నిమిషాల పాత్ర కోసమే అనిల్ రావిపూడి నాని కాల్ షీట్స్ తీసుకున్నాడు అని త్వరలోనే ..దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా సరే బాలయ్యను నాని ను ఒకే ఫ్రేమ్లో చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ పక్క అంటున్నారు జనాలు . సినీ విశ్లేషకులు సైతం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి అనిల్ రావిపూడి అన్ని పక్కాగా ప్లాన్ వేస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో మరోసారి ఎన్బికె 108 హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!