జిప్ ఓడిపోవడంతో కార్‌లోనే అంతకు తెగించిన జాన్వీ కపూర్.. షాకింగ్ ఫొటో వైరల్..!

బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందేే. అయితే ఈమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఎప్పటినుంచో ఎన్టీఆర్ తో కలిసి నటించాలన్న ఆమె కోరిక ఇప్పుడు ఎన్టీఆర్- కొరటాల శివ సినిమాతో నెరవేరబోతుంది.

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. ఇక ఇప్పుడు ఈ విషయం పక్కన పడితే తాజాగా జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో ఎవరు ఊహించని ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తాజాగా ఏప్రిల్ 27 న ముంబైలో బాలీవుడ్ 68వ ఫిలింఫేర్ అవార్డ్స్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.ఈ అవార్డ్స్ లో మిలీ సినిమాతో జాన్వీ కపూర్ కూడా నామినేషన్స్ లో నిలవడంతో ఈ వేడుకకు హాజరయ్యింది.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె బ్లూ కలర్ డ్రెస్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా తన డ్రెస్ తనని ఎంతో ఇబ్బంది పెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా స్టేజ్‌పై పెర్ఫామెన్స్ ఇచ్చే ఐదు నిమిషాల ముందు జిప్ మళ్ళీ చిరిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుని వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

 Janhvi Kapoor Dress Zip Rips At 68th Filmfare Awards-TeluguStop.com

ఆ ఫొటోలో జాన్వీ కారులో కూర్చొని ఉంటే టైలర్ వెనుక నుంచి ఆ జిప్ ని కుడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమాలోనే కాకుండా జాన్వీ కపూర్ కి రామ్‌చరణ్ హీరోగా రాబోతున్న మరో సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టు సమాచారం. డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో జాన్వీకపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Share post:

Latest