`ఏజెంట్` ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. అదృష్టం అంటే ఇదే!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ‌తో మ‌రొక హీరో సినిమా చేయ‌డం ఇండ‌స్ట్రీలో స‌ర్వ సాధార‌ణం. అయితే అలా హీరోలు వ‌దిలేసిన క‌థ‌లు ఒక్కోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. అలాగే ఒక్కోసారి బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డుతుంటారు. ఇక నిన్న విడుద‌లైన `ఏజెంట్‌` మూవీకి కూడా ఫ‌స్ట్ ఛాయిస్ అఖిల్ అక్కినేని కాద‌ట‌.

అఖిల్ కంటే మందే ఈ సినిమా క‌థ టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. ఆయ‌న రిజెక్ట్ చేశాడ‌ట‌. ఇంత‌కీ ఏజెంట్ వంటి డిజాస్ట‌ర్ మూవీ నుంచి త‌ప్పించుకున్న ఆ అదృష్ట‌వంతుడు ఎవ‌రో కాదు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. వక్కంతం వంశీ అందించిన క‌థ‌తో సురేంద‌ర్ రెడ్డి ఈ మూవీని స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందించాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది.

భారీ అంచ‌నాల న‌డుమ నిన్న విడుద‌లైన ఈ సినిమా తొలి ఆట నుంచే నెగ‌టివ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. అయితే నిజానికి ఏజెంట్ ను సురేంద‌ర్ రెడ్డి మొద‌ట‌ రామ్ చరణ్ తో తీద్దాం అనుకున్నాడు. అప్పట్లో రామ్ చరణ్ ఈ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు కూడా. అయితే ఆయన ఒప్పుకున్న కమిట్మెంట్స్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడం తో.. చ‌ర‌ణ్ సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ త‌ర్వాత క‌థ అఖిల్ కు న‌చ్చ‌డంతో సినిమాను ప‌ట్టాలెక్కించారు. ఫైన‌ల్ గా ఈ మూవీ అట్ట‌హాసంగా విడుద‌లై అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఏజెంట్ నుంచి చ‌ర‌ణ్ త‌ప్పించుకోవ‌డంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Share post:

Latest