ఒకప్పుడు హీరోయిన్లుగా ప్రేక్షకులను మెప్పించి.. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకొని సినిమాలకు దూరమైన వారు చాలామంది ఉన్నారు. తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతో దాదాపుగా సినిమాలకు దూరమైన వారు మరి కొందరైతే.. తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన వారు మరికొందరు. అలా పెళ్లి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయిన స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
లయ:
మన తెలుగు విజయవాడ అమ్మయి లయ టాలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే ఓ డాక్టర్‌ని పెళ్లి చెసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది.. మళ్ళీ చాలా కాలం తర్వాత రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ లో నటించింది.. పిల్లలిద్దరినీ బాల నటులుగా పరిచయం చేసింది.. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన లయ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.
ప్రియాంక చోప్రా:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కోనసాగుతున్న సమయంలోనే హలీవుడ్ సినిమాలో అవకాశం రావడంతో అక్కడకు వెళ్ళి పోయింది. హలీవుడ్‌లో సిరీస్, సినిమాలు చేస్తూ.. అక్కడి వ్యక్తి నిక్కీని పెళ్లాడి సెటిలైపోయింది. నిక్కీ ప్రియాంక కంటే వయస్సులో పదేళ్లు చిన్నోడు.
కలర్స్ స్వాతి:
తెలుగులో ముందుగా యాంకర్‌గా తన కేరీర్‌ను యొదలు పెట్టిన కలర్స్ స్వాతి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ కమ్ సింగర్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. స్వాతి కూడా ఓ యూఎస్ అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉంటుంది. ఇటీవలే ‘పంచతంత్రం’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది..
రిచా గంగోపాధ్యాయ్:
‘లీడర్’, ‘మిర్చి’, ‘మిరపకాయ్’, ‘భాయ్’ సినిమాలు చేసిన రిచా గంగోపాధ్యాయ్.. స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లి ప్రేమలో పడి పెళ్లి చేసుకుని అక్కడే ఫిక్స్ అయిపోయింది..
అంకిత:
చిన్నప్పుడు రస్నాబేబీగా పాపులర్ అయిన అంకిత.. హీరోయిన్‌గా ‘లాహిరి లాహిరి లాహిరి లో’, ‘సింహాద్రి’ లాంటి సినిమాలతో అలరించింది.. వ్యాపారవేత్తను వివాహం చేసుకుని న్యూజెర్సీలో ఉంటుంది.. ఆమెకు ఇద్దరు పిల్లలు.
అన్షు అంబానీ:
మన్మథుడు’ లో నటించి మెప్పించిన అన్షు అంబానీ పెళ్లి తర్వాత లండన్‌లో ఉంటుంది..ఆమెకు ఓ పాప.. ప్రస్తుతం ఈమె క్లాతింగ్ లేబుల్ బిజినెస్‌లో రాణిస్తుంది అన్షు..
గోపిక:
నా ఆటోగ్రాఫ్’ తో తెలుగు తెరకు పరిచయమైన గోపిక.. తమిళ్, మలయాళంలోనూ నటించింది.. డాక్టర్‌ని మ్యారేజ్ చేసుకుని ఆస్ట్రేలియాలో ఉంటుంది.
మాధవి:
సీనియర్ నటి మాధవి వ్యాపారవేత్త అయిన రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకున్నారు. రాల్ఫ్ శర్మ తండ్రి జర్మనీకి చెందినవారు, తల్లి భారతదేశానికి చెందినవారు. వీరిద్దరూ ఇప్పుడు న్యూజెర్సీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు.