స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 చిత్రంపై భారీగానే ఆశలు ఉన్నాయి అభిమానులకు.. పుష్ప 2021 లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. పుష్ప -2 సినిమా దాదాపుగా రూ .1000 కోట్ల మార్పుని అందుకోవాలని లక్ష్యంతో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని మాస్ అంశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి.
హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్స్ ని ఈ సినిమా కోసం డిజైన్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం డాన్ గా చూపించబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగానే స్టోరీ ఎలివేషన్ కూడా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ కూడా ప్రస్తుతం జరుగుతోందని వార్తలు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ డిజిటల్ స్ట్రిమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ పోటీ పడుతోందని సమాచారం. టాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలను వరుస పెట్టి డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటోంది.. పుష్ప -2 సినిమా కోసం ఏకంగా నిర్మాతలు డిజిటల్ రైట్స్ ని రూ .200 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాతలతో సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు డిమాండ్ చేస్తున్న స్థాయిలో 200 కోట్లు ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.