రవితేజకు ఇష్టం లేని పెళ్లి చేసిన తల్లి.. ఆస‌లు కారణం ఇదే..?

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో ముందుగా చిరంజీవి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజజ పేరు వినిపిస్తుంది. ఈయన తన కెరీర్ మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, నటిస్తూ హీరోగా అవకాశాలు తెచ్చుకున్నారు. రవితేజ నటించిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇటీవ‌ల‌ కాలంలో మాస్ మహారాజా యంగ్ హీరోయిన్లతో న‌టిస్తు కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

Will Ravi Teja End the Year on a High?

ఇక గత సంవత్సరం ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి రు. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం ఈ హీరో రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పుడూ రవితేజ సినీ కెరియర్ గురించి పక్కనపడితే ఆయన ఫ్యామిలీ విషయానికొస్తే ఆయన ఎప్పుడూ తన కుటుంబాన్ని పరిశ్రమకు దూరంగా ఉంచుతూ వస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రవితేజ ఫ్యామిలీ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. రవితేజ కి ఇష్టం లేకుండానే తన తల్లి పెళ్లి చేసింట‌.

Case Filed Against Actor Ravi Teja's Mother for Demolition of Government  Property

అయితే అసలు విషయంలోకి వెళ్తే..రవితేజ పెళ్లి చేసుకున్న కళ్యాణి మ‌రి ఎవరో కాదు స్వయానా రవితేజ తల్లి రాజ్యలక్ష్మి సోదరుడి కూతురు. అంటే రవితేజ మేనమామ కూతురు అన్నమాట. అయితే ఇండస్ట్రీలో రవితేజ హీరోగా మంచి పొజిషన్ కి వచ్చాక ఒకవేళ రవితేజ ఎక్కడ హీరోయిన్లతో లవ్ లో పడి పెళ్లి చేసుకుంటాడో.. బయటి నుంచి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో ? అని ముందుగానే భావించిన రవితేజ తల్లి రాజ్యలక్ష్మి రవితేజకు అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ముందే తన మేనకోడలు కళ్యాణి ఇచ్చి పెళ్లి చేసింది.

Ravi Teja Family Memebrs, Wife, Daughter, Son, Father, Mother, Brothers &  Biography - YouTube

ఇక రవితేజను ఈ పెళ్లికి త‌ల్లి రాజ్యలక్ష్మి చాలానే క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఎందుకంటే రవితేజ కు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. ఇంకొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో ఎదిగాక చేసుకుందాం అనుకున్నారట. కానీ రాజ్యలక్ష్మి మాత్రం రవితేజను ఒప్పించి కళ్యాణి ని పెళ్లి చేసింది.ఇక పెళ్లయ్యాక కళ్యాణి సినీ ఇండస్ట్రీకి చాలా వరకు దూరంగా ఉండి ఇంటిపట్టునే ఉంటూ రవితేజ పనుల్లో చేదోడువాదోడుగా ఉంది.