ఆ ఒక్క పని చేస్తే రష్మిక ఎంత తీసుకుంటుందో తెలుసా..అందుకేగా నేషనల్ క్రష్ అనేది..!!

రష్మిక మందన .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . కన్నడ ముద్దుగుమ్మ అయినా సరే .. తెలుగులో టాప్ మోస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుని ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఓ రేంజ్ లో ఏలేస్తూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . ఛలో అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఫస్ట్ సినిమాతో సూపర్ హాట్ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది .

అంతేనా ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరో ల ని అట్రాక్ట్ చేసి వాళ్ళ సినిమాలో అవకాశాలు అందుకుంది . తద్వారా పుష్ప సినిమాలో ఛాన్స్ దక్కించుకొని రీసెంట్ గానే ఐపీఎల్ ఓపెనింగ్ సెరిమనీలో డాన్స్ చేసి తెలుగు హీరోయిన్ల పరువును నిలబెట్టింది. ఈ ఈవెంట్లో ఫస్ట్ టైం తెలుగు హీరోయిన్స్ పార్టిసిపేట్ చేశారు . వాళ్ళల్లో ఒకరుగా నిలిచింది రష్మిక మందన . ఈ ఈవెంట్లో డాన్స్ చేసినందుకు ఏకంగా ఐదు కోట్లు చార్జ్ చేసిన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

రష్మిక సినిమాలో కాకుండా బయట ఈవెంట్స్ లో డాన్స్ చేసిన.. ఏదైనా షాప్ ఓపెనింగ్ కి ఈవెంట్ కి అటెండ్ అయిన ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా ..? అంటూ జనాలు షాక్ అవుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక మందన ఒక్కొక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల పారితోషం తీసుకుంటే.. ఏదైనా ఈవెంట్స్ కి కానీ ..షాప్ ఓపెనింగ్స్ కి కానీ..

ఆ స్థాయికి తగ్గట్లే పారితోషకం తీసుకుంటుందని .. దాదాపు రెండు కోట్ల తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోదు అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది . అంతేకాదు ఒకప్పుడు రష్మిక మందన్న బొమ్మ కొనుక్కునే దానికి కూడా మాకు స్తోమత లేదు అంటూ ఓపెన్ గానే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . అలాంటి రష్మిక ఇప్పుడు కోట్లకు కోట్ల ఆస్తులను కూడా పెట్టేసింది.. అంటే అమ్మడు ఏ విధంగా మారిపోయిందో ఊహించుకోవచ్చు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!