రీ రిలీజ్ లో ఆరెంజ్ చిత్రానికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు.. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదట్లో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. స్టార్ హీరో కుమారుడు సినీరంగంలోకి అడుగు పెట్టారంటూ కామెంట్లు కూడా వినిపించాయి.. కానీ అవేం పట్టించుకోకుండా ప్రతి సినిమాకు తనలోని నటనను పెంచుతూ ముందుకు వెళ్లారు రామ్ చరణ్ ఇప్పుడు సినీ విమర్శకులచే ప్రశంశాలు కూడా అందుకుంటున్నారు.

Orange (Telugu) (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

RRR చిత్రంతో రామ్ చరణ్ హాలీవుడ్ మేకర్స్ ను సైతం ఫిదా చేశారు. ఆయన పట్టుదల ఎలా ఉందంటే ఒకప్పుడు హీరోగా సెట్ కాదని అన్న వారే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటూ పొగిడేస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్లు డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలలో ఆరెంజ్ చిత్రం కూడా ఒకటి. 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్ల సక్సెస్ కాలేక పోయింది ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్టుగా నిలిచాయి. బొమ్మరిల్లు భాస్కర్ ఏ సినిమాకి దర్శకత్వం వహించగా మెగా బ్రదర్ నాగబాబు తన సొంత బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. జెనీలియా హీరోయిన్ గా నటించింది.

ప్రేమ కథ గా డిఫరెంట్ గా తెరకెక్కించడంతో డైరెక్టర్ భాస్కర్ ఈ సినిమా కథతో బోల్తా పడ్డారని వార్తలు వినిపించాయి.. అంతేకాకుండా ఈ సినిమాతో నాగబాబు తీవ్రమైన నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఇక ఇదే సినిమా ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయడం జరిగింది నాగబాబు. మూడు రోజుల్లో పాటు స్క్రీనింగ్ అయిన ఈ సినిమాకు వచ్చే డబ్బులతో జనసేన పార్టీకి విరాళం ఇస్తానని తెలిపారు. ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా రూ.3 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ఈ విషయాన్ని నాగబాబు అధికారికంగా ప్రకటిస్తూ ఈ సినిమా రీ రిలీజ్ హిట్టు కావడం తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు.