చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది నటులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు. గత కోన్ని దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో పెళ్లి అనేది చూస్తే 100కి 90 శాతం ప్రేమ పెళ్లిళ్లే జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహలు చేసుకునే హీరోలో, హీరోయిన్లు చాలా తక్కువ మంది మత్రమే ఉన్నారు. మరి అందులోను చిత్ర పరిశ్రమలో ఉన్నావరు తమ సోంత బంధుత్వాలు వారిని పెళ్లి చేసుకోరు. మరి అందులోనూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్న మరదళ్లోనో, మేనకోడళ్లనో పెళ్లి చేసుకునేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపరు.
చిన్నతనం నుంచి కలిసి పెరగడంతో వాళ్లను పెళ్లి చేసుకుంటే ఆ ఫీల్ ఉండదన్న భావనే వారిలో ఎక్కువుగా ఉంటుంది. అయితే వారిలో కొందరు స్టార్ హీరోలు మాత్రం తమ కుంటుంబసభ్యుల మాటలకు విలువ ఇచ్చి.. వారి కోరిక మేరకు తమ సోంత మరదళ్లనే పెళ్లి చేసుకున్నారు. మరి అందులోను స్టార్ హీరోలు కూడా ఉండడం మరో విశేషం. ఇలా సొంత మరదళ్లనే పెళ్లి చేసుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరు ఇప్పుడు చూద్దాం.
1- ఎన్టీఆర్ – బసవతారకం :
నటరత్న ఎన్టీఆర్ తన సొంత మేనమామ కుమార్తె బసవతారకంనే వివాహమాడారు. ఇంట్లో పెద్దలు వీరికి చిన్నప్పుడే పెళ్లి చేయాలని అనుకున్నారు. అందుకే ఎన్టీఆర్‌కు కూడా చిన్న వయస్సులోనే తన మరదలు బవసతారకంతో పెళ్లి జరిగింది. ఈ దంపతులకే 11 మంది పిల్లలు. బసవతారకంకు బావ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. చెన్నైలో ఎప్పుడు ఇన్డోర్ షూటింగ్‌లు జరిగినా కూడా ఆమే స్వయంగా వంట చేసుకుని షూటింగ్స్‌కు తీసుకుని వెళ్లి మరీ తన బావకు వడ్డించి, అన్నం తినిపించి వచ్చేది.
2- మోహన్‌బాబు – విద్యాదేవి, నిర్మలాదేవి :
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు ముందుగా విద్యాదేవితో వివాహం జరిగింది. ఈ దంపతులకు మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న జన్మించారు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో మోహన్‌బాబు సినిమాలపై దృష్టి పెడుతూ భార్యను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇది నచ్చని విద్యాదేవి మోహన్‌బాబుతో ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత దాసరి లాంటి వాళ్లు కలుగ చేసుకుని పిల్లలు అనాథలు కాకూడదని విద్యాదేవి సొంత చెల్లి నిర్మలాదేవితో మోహన్‌బాబుకు మళ్లీ పెళ్లి చేశారు. మనోజ్ ఈ దంపతులకు పుట్టినవాడే.
3- సూపర్‌స్టార్ కృష్ణ – ఇందిరాదేవి :
టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ తన మరదలు అయిన ఇందిరాదేవిని పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా బాగా సెటిల్ అయిన వారే. తర్వాత కృష్ణ అనుకోకుండా తన తోటి హీరోయిన్ విజయనిర్మలను రెండో భార్యగా స్వీకరించినా కూడా తన మరదలు ఇందిరకు ఏనాడు అన్యాయం చేయలేదు.
4- కార్తీ – రజనీ :
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా తన అన్నబాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కార్తీ కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల మనస్సులను కూడా గెలుచుకున్నాడు. కార్తీ తన తల్లిదండ్రుల కోరిక మేరకు తన సొంత మేనమామ కుమార్తె రజనీనే పెళ్లాడి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే పెళ్లికి ముందు కార్తీ మిల్కీబ్యూటీ తమన్నాతో ప్రేమలో పడ్డాడని టాక్ ఉంది.
5 – ఆది – అరుణ :
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు హీరో ఆది సాయికుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆది ఆయన సొంత మరదలిని వివాహం చేసుకున్నాడు. సాయి కుమార్ భార్య తమ్ముడి కూతురుతో ఆది పెళ్లి జరిగింది. వీరిద్దరి వివాహాన్ని చిన్నప్పుడే పెద్దలు నిశ్చయించినట్టు తెలుస్తోంది.