బీజేపీకి టీడీపీ దూరమే..గట్టిగానే టార్గెట్ చేశారు.!

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య ఉంటుందంటే..ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. కాకపోతే బి‌జే‌పితో పొత్తు విషయంలో మాత్రం క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. జనసేన-బి‌జే‌పి కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. కానీ టి‌డి‌పితో కలవడానికి జనసేన రెడీ అవుతుంది. ఇలాంటి సమయంలో బి‌జే‌పిని కూడా కలుపుకుని టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాలని జనసేన చూస్తుంది. కానీ బి‌జే‌పి మాత్రం టి‌డి‌పితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. టి‌డి‌పి వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నామని బి‌జే‌పి నేతలు అంటున్నారు.

దీంతో బి‌జే‌పి కలిసే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఇంతకాలం టి‌డి‌పి సైతం బి‌జే‌పి పట్ల మెతక వైఖరితోనే ఉంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండటంతో బి‌జే‌పిని పెద్దగా టార్గెట్ చేయలేదు. అయితే వైసీపీతో మాత్రం బి‌జే‌పి రహస్య స్నేహం కొనసాగుతూనే ఉంది. అటు కేంద్రంలో కొందరు నేతలు,. ఇటు రాష్ట్రంలో కొందరు నేతలు జగన్‌కు సపోర్ట్ గానే నిలుస్తున్నారు. ఆయనకు కావాల్సినప్పుడల్లా అప్పు పుడుతుంది.

ఈ పరిణామాలని బట్టి చూస్తే బి‌జే‌పి, వైసీపీ స్నేహం గురించి అందరికీ తెలుస్తుందని ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా వ్యాఖ్యానించారు..జగన్ కు అదృష్టం ఉందని, అనుకుంటే చాలు అప్పు పుడుతుందని, అసలు ఏప్రిల్ నెలలో చేయాల్సిన అప్పు మార్చిలోనే ఇచ్చారని, అంటే ఎవరెవరు కలిసి ఉన్నారో అర్ధమవుతుందని అన్నారు.  అటు టి‌డి‌పి నేత పితాని సత్యనారాయణ సైతం బి‌జే‌పిని టార్గెట్ చేశారు. పవన్‌ని టి‌డి‌పితో కలవనివ్వకుండా బి‌జే‌పి భయపెడుతుందని, అలా ఎంతకాలం భయపెడుతుందో చూస్తామని అన్నారు.

అంటే టి‌డి‌పి నేతల మాటలు బట్టి చూస్తే బి‌జే‌పిని ఇంకా టార్గెట్ చేయడం మొదలైందని అర్ధమైపోతుంది. కాబట్టి ఇంకా బి‌జే‌పితో పొత్తు ఉండే అవకాశం కనిపించడం లేదు. కలిసొస్తే పవన్ తో పొత్తు ఉంటుంది..లేదంటే టి‌డి‌పి ఒంటరిగానే బరిలో దిగుతుంది.