లగ్జరీ కారు కొన్న రవితేజ.. ధ‌ర ఎంతో తెలిసి షాక‌వుతున్న నెటిజ‌న్లు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజాగా ఓ ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేశారు. స్టార్ హీరోలు కారు కొన్నారంటే దాని ఖ‌రీదు కోట్ల‌లో ఉంటుంది. కానీ, ర‌వితే కారు ధ‌ర ఎంతో తెలిసి షాక‌వుతున్నారు నెటిజ‌న్లు. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే రీసెంట్ గా ర‌వితేజ ఓ ఎలక్ట్రిక్ కారుని కొన్నారు.

BYD ATTO 3 EV అనే మోడల్ కి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారులో అనేక సదుపాయాలు ఉన్నాయి. ఈ కారును చైనాకి చెందిన కంపెనీ తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 34 లక్షల 49 వేలు మాత్ర‌మే. ఈ కారులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్, ఆండ్రాయిడ్, ఫరోనామిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, పవర్ టైల్ గేట్ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

త‌క్కువ రేటు అయిన‌ప్ప‌టికీ ఇన్ని మంచి ఫీచ‌ర్లు ఉండ‌టం వ‌ల్లే ర‌వితేజ ఎంతో ఇష్ట‌ప‌డి మ‌రీ ఈ కారును కొనుగోలు చేశార‌ట‌. అంతేకాదు, తాజాగా తన పేరు మీదే ఈ కారును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ పనుల కోసం రవితేజ స్వయంగా ఆర్టీఏ కార్యాలయానికి హాజరయ్యారు. అంతేకాదు, TS09GB2628 అనే ఫ్యాన్సీ నంబర్ కోసం అదనంగా మరో 17,628 రూపాయలు ఖర్చు చేశారు.