సాలిడ్ ధ‌ర ప‌లికిన `రావ‌ణాసుర‌` ఓటీటీ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎక్క‌డ‌? ఎప్పుడు?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `రావ‌ణాసుర‌`. ‘స్వామిరారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా న‌టించాడు.

హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. రవితేజ క్యారక్టరైజేషన్ సూప‌ర్ గా ఉంది. కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ లో ఆయ‌న అద‌ర‌గొట్టేశాడు. ఫ‌స్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. సెకండ్ హాఫ్ లో వ‌చ్చే ట్విస్ట్‌లు ఆక‌ట్టుకుంటాయి.

కొన్ని మైన‌స్ లు ఉన్న‌ప్ప‌టికీ.. సినిమా బాగుందంటూ సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌పోతే రావ‌ణాసుర ఓటీటీ పార్ట‌న‌ర్ లాక్ అయింది. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రావ‌ణాసుర డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సాలిడ్ ధ‌ర‌కు సొంతం చేసుకుంది. ఓటీటీ రైట్స్ ఇర‌వై కోట్ల‌కు పైగానే ప‌లికియాని అంటున్నారు. ఇక థియేట‌ర్స్ లో రిలీజైన ఆరు వారాలకు ‘రావణాసుర’ ఓటీటీలోకి అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, టీవీ రైట్స్ ని జీ తెలుగు సంపాదించింది.