అయ్యయ్యో.. అంత కష్టం వచ్చిందే పూజా పాపకి.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఒకప్పుడు పూజ హెగ్డే రోడ్డుపైకి వచ్చిందంటే కెమెరాలు పట్టుకుని ఫోటో ఫోటో అంటూ ఎగబడి పోయేవారు జనాలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పూజా హెగ్డే రోడ్డుపై వెళ్తున్నా సరే ఎవరు పట్టించుకున్న పాపానికి పోవడం లేదు . దానంతటకీ కారణం పూజా హెగ్డే వరుసగా డిజాస్టర్ అందుకోవడమే …

అమ్మడు హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది . చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే పూజ హెగ్డేను డైరెక్టర్స్ పట్టించుకోవడం లేదు. బాలీవుడ్లో అరాకొరా ఈవెంట్లల్లో మెరుస్తున్నా .. పూజ హెగ్డే స్థాయికి అవి సరిపోవు . ప్రజెంట్ పూజా హెగ్డే తన ఆశలని సల్మాన్ ఖాన్ పైనే పెట్టుకుని ఉంది. ఆ సినిమా హిట్ అయితే పూజ కెరీర్ మారే ఛాన్సెస్ ఉన్నాయి.

స్లమాన్ లాంటి స్టార్ హీరోతో పూజ హెగ్డే చేస్తున్న సరే .. ఇప్పటికీ తన క్రేజ్ ఏ మాత్రం పెరగకపోవడం .. ఇప్పుడు అందరికీ కొత్త డౌట్లు వచ్చేలా చేస్తుంది. రీసెంట్గా ముంబైలో ఓ జిమ్ లో వర్క్ అవుట్ చేసి బయటకు వచ్చిన పూజను మీడియా వాళ్ళు పట్టించుకునిందే లేదు. ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు . అదే సినిమా హిట్ అయి సూపర్ టాక్ వచ్చిందంటే మాత్రం పూజ హెగ్డే పైకి ఎగబడి పోతారు.. ప్లాప్ అయ్యేసరికి పూజను పట్టించుకునే నాధుడే లేడు . పాపం ఎంత కష్టం వచ్చిందో అంటూ దారుణంగా దిగాలుగా కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి పూజా హెగ్డే ఇలాంటి డిజాస్టర్ నుంచి ఎలా బయటపడుతుందో..?