బాలయ్యకు చెల్లి అనగానే ఒక్కసారిగా భోరున‌ ఏడ్చేసిన లయ.. డైరెక్టర్ అంత పని చేశాడా..!

నట‌సింహ బాలకృష్ణ సినిమాలో అవ‌కాశం వస్తే వదులుకోవడానికి ఏ హీరోయిన్ ఇష్టపడరు. బాలయ్యకు జోడిగా నటించే ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా వెంటనే ఓకే చెబుతారు. నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో చాలామంది హీరోల పక్కన నటించేందుకు ఇష్టపడటం లేదు. అయితే బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం నయనతార వెంటనే ఓకే చెబుతుంది. బాలయ్యకు జోడిగా సింహ, శ్రీరామరాజ్యం, జై సింహా వంటో సూప‌ర్‌ హిట్ సినిమాల్లో నయనతార నటించింది.

ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు బాలయ్య పక్కన నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలయ్యతో ఒక్క సినిమా చేస్తే తమ కెరీర్ టర్న్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం బాలయ్య సినిమాలో ఛాన్స్ వచ్చిన వెంటనే ఏడ్చేసిందట.. ఆ హీరోయిన్ ఎవరో కాదు తెలుగు అమ్మాయి లయ. ల‌య స్వ‌స్థ‌లం విజ‌య‌వాడ‌. ఆమె అక్క‌డే న‌లంద కాలేజ్‌లో చ‌దివింది. త‌ర్వాత టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో న‌టించిన ల‌య ఆ త‌ర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పాక అమెరికాలో ఉండే ఓ డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకుని అక్క‌డే సెటిల్ అయ్యింది.

బాలయ్య కాలు తొక్కానని షూటింగ్ కి ప్యాకప్ చెప్పారు... నటి కామెంట్స్ వైరల్ |  actress laya interesting comments about hero balakrishna details, Balayya, laya,Vijayendra Varma movie, actress laya ...

వివి వినాయక్‌ దర్శకత్వంలో బాలయ్య హీరోగా 2002లో వచ్చిన సినిమా చెన్నకేశవరెడ్డి. ఈ సినిమాలో శ్రీయ, ట‌బు హీరోయిన్లుగా నటించారు. బాలయ్యకు సోదరిగా ఒకప్పటి హీరోయిన్ దేవయాని నటించింది. అయితే ఈ సోదరి పాత్ర కోసం దర్శకుడు వినాయక్ ముందుగా హీరోయిన్ ల‌య‌ను కలిసి కథ‌ చెప్పారట. బాలయ్య చెల్లి పాత్రకు మీ పేరు పరిశీలిస్తున్నామని వినాయక్‌ చెప్పడంతో లయ కాస్త అసహనం వ్యక్తం చేయ‌డంతో పాటు భోరున ఏడ్చేసింద‌ట‌.

బాలయ్య కాలు తొక్కానని షూటింగ్ కి ప్యాకప్ చెప్పారు... నటి కామెంట్స్ వైరల్ |  actress laya interesting comments about hero balakrishna details, Balayya, laya,Vijayendra Varma movie, actress laya ...

తెలుగమ్మాయిలు అక్కాచెల్లెళ్ల పాత్రలకే తప్ప హీరోయిన్ పాత్రలకు పనికిరారా ? బాలయ్యకు జోడిగా కాకుండా హీరోయిన్‌గా నటించాలాని త‌న‌కు ఉంద‌ని.. ఈ పాత్రను చేయును అని ఆమె భోరున ఏడ్చేసిందట. వెంటనే వినాయక్ ల‌య‌కు సారీ చెప్పి ఏమీ అనుకోవద్దు అమ్మ నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని అన్నారట. ఆ తర్వాత ఇదే కథ‌ దేవయానికి చెప్పిన వెంటనే ఆమె ఓకే చెప్పేసారని వినాయక్ చెప్పారు. అయితే ఆ తర్వాత 2004లో లయ- బాలయ్య కు జోడిగా విజయేంద్ర వర్మ సినిమాలో నటించింది.