చిరంజీవిలా ఉండడమే నాకు శాపం.. నటుడు షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు బుల్లితెరపై టీవీ యాక్టర్ గా పేరుపొందిన యాక్టర్ రాజ్ కుమార్ నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతంలో ఎన్నో చిత్రాలలో సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించారు. దాదాపుగా 25 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే ఉంటూ సీరియల్స్ లో బాగా రాణించారు. ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్ గా పిలిచేవారు ఈయనను చూడడానికి అచ్చం చిరంజీవిలాగా ఉండడంతో ఈయనకు ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం నిర్మాత దాసరి నారాయణరావు శిష్యుడుగా ఎంట్రీ ఇచ్చారట.

మొదట అమ్మ రాజీనామా అనే సినిమాతో రాజకుమార్ తన సినీ కెరియర్ను మొదలుపెట్టారు.. ఆ తర్వాత నాగబాల కాలేజీ బుల్లోడు ఇలా పలు చిత్రాలలో నటించారు ఆ తర్వాత బుల్లితెర పైన అలరించడం మొదలుపెట్టారు. దీంతో నెమ్మదిగా తెలుగు ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్నారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. చిరంజీవి లాగా ఉండడం వల్లే తనకు పెద్ద మైనస్ అయిందని తెలుపుతున్నారు.. ఎటువంటి హీరో కైనా స్టార్డమ్ తో పాటు బ్రేకింగ్ పాయింట్ ఉండాలి కానీ తన దగ్గరకు వచ్చేసరికి ఆ పాయింట్ బ్రేక్ పడిందని తెలిపారు. అందుకు కారణం నేను చిరంజీవిలా ఉండడమే అంటూ తెలిపారు.

బయట చిరంజీవి లాగా ఉన్నాడు అనడం బాగానే ఉంటుంది కానీ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మీరు ఏం చేసినా కూడా అదే మాట వస్తుంది..అని వివి రాజ్ కుమార్ తెలిపారు. చిరంజీవి లాగా ఉండడం తనకు మంచిదో చెడ్డదో తెలియదు కానీ… ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మైనస్ గా మారిపోతోందని తెలిపారు. తనతోపాటు శ్రీకాంత్, విక్రమ్ ,అజిత్, ఆనంద్ ఇలా ఏదేనిది మంది హీరోలు ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చామని తెలిపారు రాజ్ కుమార్.. వారందరి కంటే తన కెరియర్ ముందుగా మొదలయ్యిందని కానీ వాళ్లంతా తనను దాటి వెళ్లిపోయారని తెలిపారు.