రామ్ చరణ్, ఉపాసన వీడియోకి భారీ రెస్పాన్స్.. అందులో ఏముందంటే..

కొన్ని వారాల క్రితం రామ్ చరణ్, ఉపాసన కలిసి అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. చెర్రీ ఆస్కార్‌ 2023కి తాను నటించిన ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట నామినేట్ కాగా దానిని ప్రమోట్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అతనికి తోడుగా ఉపాసన కూడా వెళ్ళింది. అయితే వారిద్దరూ అక్కడ గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేశారు. అయితే ఫ్యాన్స్ ఇంకా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆస్కార్‌కి రామ్‌ చరణ్, అతని సతీమణి ఉపాసన రెడీ అవుతున్నట్లు కనిపించింది. వ్యానిటీ ఫెయిర్ (Vanity Fair) అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 66 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోలో ఉపాసన మేకప్ చేయించుకోవడం, ఆ మేకప్ మ్యాన్ గురించి చెప్పడం కూడా కనిపించింది. అలాగే తనేం జువెలరీ వేసుకుంటున్నానో కూడా తెలిపింది. మంచి సిల్క్ శారీలో రెడీ అయిన తర్వాత ఆమె రామ్‌ చరణ్‌తో కలిసి ఫొటోలు దిగింది. ఈ జంట చాలా అందంగా కనిపించింది. ఇక అంతకంటే ముందే రామ్‌ చరణ్ తన డ్రెస్ ఫ్యాషన్ గురించి వివరించాడు. అలాగే తాను ఎక్కడికి వెళ్లినా దేవుడిని పూజ చేస్తానని తెలిపాడు. మొత్తం మీద ఈ వీడియో ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోంది.

ఇకపోతే త్వరలోనే చరణ్, ఉపాసన దంపతులు తమ జీవితంలోకి తొలి బిడ్డను ఆహ్వానించనున్నారు. చెర్రీ కెరీర్‌ లైఫ్ విషయానికి వస్తే అతను గేమ్ ఛేంజర్, RC16 సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ హీరో ఆర్ఆర్ఆర్ వంటి హిట్స్ ఈ సినిమాలతో కూడా సాధిస్తాడో లేదో చూడాలి.