పుష్ప-2లో ఉర్రూతలూగించే అప్‌బీట్ సాంగ్.. డీఎస్‌పీ మ్యూజిక్‌తో పూనకాలే!

పుష్ప సినిమా మామూలు అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ పాటలోని బన్నీ మేనరిజం వైరల్ అయ్యింది. తగ్గేదేలే అనే డైలాగ్ ఇప్పటికీ చాలామంది నోళ్ళల్లో నానుతోంది. ఇక ఇందులోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. శ్రీవల్లి, సామి సామితో పాటు ఏ బిడ్డా, ఊ అంటావా వంటి అన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు సినిమాతో పాటు సినిమా సాంగ్స్ పై కూడా అందరి దృష్టి పడింది.

పుష్ప ది రైజ్‌కి అల్లు అర్జున్ సీక్వెల్‌గా తీస్తున్న పుష్ప ది రూల్ సుకుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు ఒడిశాలోని మల్కన్‌గిరి అడవుల్లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. పుష్ప నుంచి ఇప్పటికే కొన్ని లుక్స్, మోషన్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. రెండు వారాల క్రితం గ్లింప్స్‌ కూడా రిలీజ్ అయి అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి ఒక కీలక అప్‌డేట్ లీక్ అయింది. అదేంటంటే, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సెకండ్ పార్ట్ కోసం అదిరిపోయే సాంగ్స్ రూపొందిస్తున్నాడట. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తి చేశాడట. ఆ రెండు పాటలు అప్‌బీట్‌లతో అందర్నీ ఉర్రూతలూగిస్తాయని అంటున్నారు.

ఈ సినిమాలో టైటిల్ సాంగ్ యే బిడ్డా సాంగ్ మాదిరే ఉంటుందంట కానీ అంతకంటే ఎక్కువ ఇంటెన్స్ గా ఉంటుందట. ఈ పాట బాగుండటం కోసం దేవి శ్రీ ప్రసాద్ 100 కి పైగా ట్యూన్‌లను కంపోజ్ చేస్తే సుకుమార్ వాటిలో కొన్ని సెలెక్ట్ చేశాడని సమాచారం. అందులో ఒక దాన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నారు.