జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం వెనుక ఇంత కథ ఉందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి అయ్యి ఎన్ని రోజులు అవుతున్నా సరే ఎలాంటి వివాదాలు లేకుండా చాలా హ్యాపీగా వీరు తమ కాపురాన్ని సాగిస్తున్నారు. ఇక లక్ష్మి పార్వతి కూడా నందమూరి ఫ్యామిలీ కోడలుగా మంచి పేరు సంపాదించుకుంది. ఇకపోతే లక్ష్మీ ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది ఇప్పుడు చూద్దాం..

Jr NTR's Wife Lakshmi Pranathi To Be A Part Of The Social Media Family?

జూనియర్ ఎన్టీఆర్ తన 23 ఏళ్ల వయసులో హీరోయిన్ సమీరా రెడ్డి పట్ల కాస్త అట్రాక్ట్ అయ్యాడంట. ఇదే విషయం పై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను సమీరా రెడ్డి విషయంలో సరైన డిసిషన్ తీసుకోలేకపోయాను. కానీ మా ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి.. అమ్మను బాగా చూసుకోవాలని కోరుకున్నాను. ఇక నేను అనుకున్నట్లుగానే లక్ష్మీ ప్రణతి నాకు దొరికింది. తను మా అమ్మను నాకంటే కూడా చాలా బాగా చూసుకుంటుంది. అందుకే నాకు లక్ష్మీ అంటే చాలా ఇష్టం. అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరిచిత్రాన్ని కొరటాలు శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ఇంకా తయారు చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ థర్టీ అనే టైటిల్ తోని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి ఏ విధంగా విజయాన్ని అందిస్తుందో చూడాలి.