ఈ మధ్యకాలంలో ఎక్కువగా టాక్ షోలు బాగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా నిజం విత్ స్మిత అనే కార్యక్రమానికి హీరోయిన్ రాధిక శరత్ కుమార్ తో పాటు సుప్రియ ,స్వప్న దత్తుల కూడా హాజరవ్వడం జరిగింది. ఈ టాక్స్ సోనీ లైవ్లో ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు..ముఖ్యంగా రాజకీయాలలోకి వచ్చిన దానిపైన మాట్లాడడం జరిగింది అలాగే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి రాధిక పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
రాధిక మాట్లాడుతూ ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలని తెలుసుకున్నాను ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కువగా ఆలోచించడం మానేశాను..అనుకోకుండా హీరోయిన్ అయ్యాను నేను చేసిన మొదటి తెలుగు సినిమా న్యాయం కావాలి. ఆ సినిమా చేస్తున్నప్పుడు తనకు తెలుగు రాదని శ్రద్ధ పెట్టి మరి నేర్చుకున్నానని తెలిపింది రాధిక. రాజకీయ నాయకురాలు కావాలని అసలు అనుకోలేదు అది కూడా అనుకోకుండా జరిగిపోయిందని తెలిపింది.
అప్పట్లో డిఎంకె అగ్రనేత కరుణానిధి కుటుంబంతో తనకు సత్సంబంధాలు ఉండేవి.. ఒకసారి ఆయన నన్ను కలిసి అన్న డిఎంకె అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేయమన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత నుంచి చివరి వరకు నన్ను కలిసిన ప్రతిసారి జయ గారు ఒక సీరియస్ లుక్ పెట్టి..ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగేది. రాజకీయంగా తన భర్త శరత్ కుమార్ తో మైత్రి కలిగి ఉన్నప్పటికీ ఆమె తనను మాత్రం సీరియస్ గా చూసేదని తెలిపింది రాధిక.. జయలలిత గారు ఎలాంటి విషయాన్ని అయినా సరే మర్చిపోరు అంటూ రాధిక నవ్వుతూ తెలిపింది. ప్రస్తుతం రాధిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.