రోడ్డుపైనే అలాంటి ప‌ని చేసిన‌ సిద్దార్థ్-అదితి.. వీడియో వైర‌ల్‌!

ప్ర‌ముఖ హీరో సిద్దార్థ్, అదితి రావు హైద‌రి ప్రేమ‌లో ఉన్నారంటూ ఎప్ప‌టి నుంచో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ముహా స‌ముద్రం సినిమాలో వీరిద్ద‌రూ తొలిసారి క‌లిసి న‌టించారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే సిద్దార్థ్-అదితి ప్రేమ‌లో ప‌డ్డార‌ని.. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

పార్టీస్, ఫంక్షన్స్, ముంబై విధుల్లో ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నారు. కానీ, నేరుగా సిద్దార్థ్-అదితి డేటింగ్ వార్త‌ల‌పై స్పందించ‌డం లేదు. ఇక‌పోతే ఏప్రిల్ 17న సిద్దార్థ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో అదితి సిద్దార్థ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఈ మేర‌కు సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియోను పంచుకుంటూ.. `పుట్టిన రోజు శుభాకాంక్షలు సిద్దూ.. నువ్ ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలి` అని పేర్కొంది. ఇక అదితి పంచుకున్న వీడియోలో.. ఆమె సిద్దార్థ్ తో క‌లిసి రోడ్డుపేనే సరదాగా గంతులు వేస్తూ పరుగులు పెడుతూ క‌నిపించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. దీంతో మ‌రోసారి సిద్దార్థ్-అదితి డేటింగ్ వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

https://www.instagram.com/reel/CrIbFILMGVO/?utm_source=ig_web_copy_link