‘దసరా’ వసూళ్ల సునామి.. రెండు రోజుల్లోనే స‌గం టార్గెట్ గోవింద‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా సుకుమార్ శిష్యుడు శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ల‌భించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామి సృష్టిస్తోంది. ఫ‌లితంగా రెండు రోజుల్లోనే స‌గానికి పైగా టార్గెట్ గోవింద అయిపోయింది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 14.22 కోట్లు, వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 21.00 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రెండో రోజు రూ. 5.86 కోట్ల షేర్ ని అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా 8.08 కోట్ల షేర్ ని వ‌సూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా ద‌స‌రా 2 రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 10.26 కోట్లు
సీడెడ్: 3.02 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.06 కోట్లు
తూర్పు: 1.18 కోట్లు
పశ్చిమ: 71 కోట్లు
గుంటూరు: 1.46 కోట్లు
కృష్ణ: 0.92 కోట్లు
నెల్లూరు:0. 47 కోట్లు
——————————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 20.08కోట్లు(34.45కోట్లు~ గ్రాస్‌)
——————————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 2.15 కోట్లు
ఇతర భాషలు – 0.65 కోట్లు
నార్త్ ఇండియా – 0.60 కోట్లు
ఓవ‌ర్స్‌ – 5.60 కోట్లు
————————————————
టోటల్ వరల్డ్ వైడ్ – 29.08కోట్లు(52.40కోట్లు~ గ్రాస్)
————————————————

కాగా, రూ. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిల‌వాలి అంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 19.92 కోట్ల షేర్ ను రాబ‌ట్టాల్సి ఉంది.