కృష్ణాలో టీడీపీకి ఆ మూడిటిల్లో నో ఛాన్స్.!

రాష్ట్రంలో టి‌డి‌పి నిదానంగా పికప్ అవుతున్న విషయం తెలిసిందే. అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టే దిశగా టి‌డి‌పి ముందుకెళుతుంది..అయితే ఇంకా టి‌డి‌పి బలపడాల్సి ఉంది. వైసీపీని ఓడించాలంటే ఈ బలం సరిపోదనే చెప్పాలి. పలు చోట్ల టి‌డి‌పి వెనుకబడి ఉంది. ముఖ్యంగా టి‌డి‌పికి పట్టున్న కృష్ణా జిల్లాలో ఇంకా కొన్ని స్థానాల్లో పట్టు దొరకట్లేదు.

కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి..ఆ ఏడు స్థానాల్లో నాలుగు స్థానాల్లో పార్టీ బాగానే పికప్ అయింది..మూడు స్థానాల్లో వెనుకబడి ఉంది. జిల్లాలో ఉన్న స్థానాలు వచ్చి..మచిలీపట్నం, పెడన, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు, గుడివాడ, గన్నవరం..ఈ స్థానాల్లో మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన,  పెనమలూరు స్థానాల్లో టి‌డి‌పి బలపడింది. ఆధిక్యంలోకి కూడా వచ్చింది. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే..ఈ నాలుగు చోట్ల టి‌డి‌పి భారీ విజయం అందుకోవడం ఖాయం.

అయితే గుడివాడ, గన్నవరం, పామర్రు స్థానాల్లో టి‌డి‌పికి పట్టు లేదు. నిజానికి గత ఎన్నికల్లో గన్నవరంలో టి‌డి‌పి గెలిచింది. టి‌డి‌పి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఆయన వైసీపీలోకి వెళ్లడంతో గన్నవరంలో టి‌డి‌పికి బలమైన నాయకుడు లేరు. దీంతో పార్టీ వెనుకబడింది. ఇక గుడివాడ గురించి చెప్పాల్సిన పని లేదు. అక్కడ కొడాలి నానికి చెక్ పెట్టే టి‌డి‌పి నేత కనిపించడం లేదు.

ఇక ఎన్టీఆర్ పుట్టిన గడ్డ పామర్రులో టి‌డి‌పి ఇంతవరకు గెలవలేదు..వరుసగా ఓడిపోతూ వస్తుంది. ఇప్పటికీ కూడా అక్కడ టి‌డి‌పికి ఏ మాత్రం ఛాన్స్ రావడం లేదు. మరి ఎన్నికలకు ఏడాది సమయం ఉంది..ఈ లోపు పార్టీ బలపడితే సత్తా చాటే ఛాన్స్ ఉంది.