`ఆదిపురుష్` పోస్టర్ లో బ్లెండర్ మిస్టేక్స్.. ఓం రౌత్ మ‌ళ్లీ దొరికేశాడుగా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్‌`. టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లపై అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు.

ఇందులో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ఇత‌ర కీక‌ల పాత్ర‌ల‌ను పోషించారు. ఇప్ప‌టికే ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, గ‌త ఏడాది బ‌య‌ట‌కు వ‌దిలిన టీజ‌ర్‌పై భార ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఓం రౌత్ దిద్దుపాటు చ‌ర్చ‌లు చేప‌ట్టి రిలీజ్‌ను జూన్ 16కు పోస్ట్ పోన్ చేసింది. ఇక‌పోతే శ్రీ‌రామ‌న‌వ‌మి పండుగ సంద‌ర్భంగా మార్చి 30న ఆదిపురుష్ నుంచి ఓ పోస్ట్ ను బ‌య‌టకు వ‌దిలారు.

సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఉన్న శ్రీ రాముడు పోస్టర్‍ ఇది. అయితే ఈ పోస్ట‌ర్ లో బ్లెండ‌ర్ మిస్టేక్స్ ఉన్నాయంటూ మ‌ళ్లీ ఓం రౌత్ ను ఏకేస్తున్నారు. సీత మెడలో తాళి, కాళికి మెట్టెలు లేవు. ఈ విష‌యంలో ఓం రౌత్ ను కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. అలాగే లక్ష్మణుడికి గడ్డం ఉండటం ఏంటని మ‌రికొంద‌రు చుర‌క‌లు వేస్తున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్ రియలస్టిక్ గా లేద‌ని, సీరియ‌ళ్ల స్థాయిలో కూడా ఆదిపురుష్ ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ లేద‌ని ఇంకొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి కొత్త పోస్టర్ తో ఓం రౌత్ మ‌ళ్లీ అడ్డంగా దొరికేశాడు.