బీభత్సమైన స్టార్‌డమ్‌ను చేజేతులా నాశనం చేసుకుంటున్న శ్రీలీల.. అమ్మడికి అదే గతి??

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తన రెండవ చిత్రం ధమాకాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ సాధించి స్టార్‌డమ్‌ని అందుకుంది. దాంతో అందరూ ఆమె పెద్ద స్టార్ల సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కానీ ఆమె సినిమాలో సెకండ్ ఫిడేల్ పాత్రలను ఎంచుకుంటుంది. ధమాకా తర్వాత నాని, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, శర్వానంద్ వంటి వారితో కలిసి పనిచేయడానికి శ్రీలీల ఎంచుకుంటే బాగుండేది. ఆ హీరోలతో హిట్స్ కొడితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో కలిసి నటించే అవకాశం దక్కించుకునేది.

కానీ శ్రీలీల సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB 28, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 108 లో సెకండ్ హీరోయిన్‌గా చేయడానికి సిద్ధమైంది. SSMB 28 లో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల కూడా ఈ కథలో హీరోయిన్ అని మేకర్స్ చెబుతున్నప్పటికీ అందులో నిజం లేదని ఈజీగా ఎవరైనా చెప్పవచ్చు. మరోవైపు, NBK 108లో శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తోంది. ఇక బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇలా చూసుకుంటే, ఈ చిత్రానికి కూడా శ్రీలీల హీరోయిన్ కాదు.

స్టార్ హీరోల సినిమాల్లో ఇలా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడం కంటే కనీసం స్మాల్ హీరోల సినిమాల్లో అయినా ఆమె హీరోయిన్ పాత్రలనే ఎంపిక చేసుకుని ఉంటే బాగుండేది అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ముందుగా అలానే ముందుకు వెళితే చివరికి హీరోయిన్ అనే ట్యాగ్ పోయి సైడ్ క్యారెక్టర్ నటీమని అనే ముద్ర పడుతుంది. దీనివల్ల ఆమె కెరీర్ నాశనం అవుతుంది అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరి శ్రీ లీల ఈ విషయాన్ని డామేజ్ జరగకముందే అర్థం చేసుకుంటుందో లేదో చూడాలి.