ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేయనున్న క్రికెటర్ అంబాటి రాయుడు..!!

తెలుగు క్రికెటర్ అంబాటి రాయుడు తాను తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది. తాను రాజకీయాలలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుపుతూ అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలను కూడా తెలియజేశారు. తమ పార్టీలోకి రావడానికి బిఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్ ప్రయత్నించినట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న అంబాటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ అలాంటివేవీ లేకుండా తెలుగు ప్రజలంతా ఎక్కువగా అభిమానించే క్రికెట్ గా పేరు పొందారు.


అంబాటి రాయుడు హైదరాబాద్ తరుపున ఆడినప్పటికీ తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మాత్రమే ఉంటానని తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.. అంబాటి రాయుడు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ఒక పత్రిక రాయడం జరిగింది. తాజాగా ఇప్పుడు మరొక ప్రచారం జరుగుతోంది ..ఆయన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలా అర్థం కావడానికి అంబాటి రాయుడే అవకాశం ఇచ్చారు వైయస్ జగన్ ను ఆయన ప్రశంశాలతో ముంచేత్తుతూ ఒక ట్వీట్ షేర్ చేయడం జరిగింది.

శ్రీకాకుళం జిల్లా ప్రగతికి అత్యంత ప్రధానమైన మూలపేట పోర్టుకు వైఎస్ జగన్ గడచిన కొద్దిరోజుల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశిస్తూ ఒక ప్రసంగాన్ని చేశారు వైసీపీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన దీన్ని అంబాటి రాయుడు రీ ట్వీట్ చేశారు. అలా ట్విట్ చేస్తూ తన వ్యాఖ్యాన్ని కూడా జోడించడం జరిగింది. మన సీఎం వైఎస్ జగన్ ప్రసంగం అద్భుతం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు నమ్మేది విశ్వసించేది మిమ్మల్నే సార్ అంటూ ప్రశంసించారు. దీంతో ఈ క్రికెటర్ వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

https://twitter.com/RayuduAmbati/status/1648652921431633920?s=20