అల్లు అర్హ స్పెషల్ టాలెంట్ చూశారా.. ఆశ్చర్యపోతారు

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తండ్రితో కలిసి ఈ చిన్నారి చేసే అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. గతంలో తన తండ్రితో కలిసి ఆమె ముద్దుముద్దుగా పలికిన మాటల వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. చిన్నతనంలోనే ఎంత ముద్దుగా ఉంటుందో అంతే స్థాయిలో టాలెంటెండ్ అని ఆ పాప నిరూపించుకుంది. తాజాగా విడుదలైన శాకుంతలం సినిమాలో సమంత చిన్నప్పటి రోల్‌ను అల్లు అర్హ పోషించింది. సినిమా ఆశించిన విజయం దక్కిచుకోకపోయినా సమంతతో పాటు అల్లు అర్హ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తెరపై తమ అభిమాన హీరో కుమార్తెను చూసిన ఫ్యాన్స్ ఆమె నటన పట్ల ఆశ్చర్యపోయారు. తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడే అర్హ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌లో అల్లు అర్జున్ నివాసానికి తరచూ చాలా మంది ఫ్యాన్స్ వస్తుంటారు. తమ అభిమాన హీరోను దగ్గర నుంచి చూడాలని వారు భావిస్తుంటారు. ఇంటి గేట్ వద్దకు వచ్చిన అభిమానులకు అల్లు అర్హ కనిపించింది. ఆమెను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. దీంతో అభిమానులను పలకరించేందుకు గేట్ వద్దకు అల్లు అర్హ వచ్చింది. ఆ సమయంలో అర్హ తన ప్రత్యేకమైన టాలెంట్ ప్రదర్శించింది. తన కనురెప్పలను పైకి పెట్టి హారర్ సినిమాలో కనిపించే విధంగా తన కళ్లను చూపించింది. ఇది చూసిన అభిమానులు కేకలు, ఈలలతో హోరెత్తించారు.

అయితే వెంటనే అర్హను ఆ ఇంట్లో పని చేసే మరో అమ్మాయి తీసుకుపోయింది. ఇక ఈ వీడియో సోషల్ మీడిాయాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అర్హకు ప్రత్యేకమైన టాలెంట్ ఉందని, చక్కగా తెలుగు మాట్లాడడంతో పాటు ఇంకా అనేకమైన ప్రత్యేక లక్షణాలున్నాయని దీని ద్వారా అర్ధం అవుతోంది. శాకుంతలం సినిమా దర్శకుడు గుణశేఖర్ కూడా అల్లు అర్హపై సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ప్రశంసలు కురిపించాడు. అర్హ మాట్లాడే తెలుగు స్పష్టంగా ఉంటుందని, తెలుగు తప్పా మరే భాష ఆమెకు రాదని అభినందించాడు. ఈ విషయంలో బన్నీని ప్రత్యేకంగా ప్రశంసించాడు.