బందరులో బాబు జోరు..కొల్లుకు డౌట్ లేనట్లే?

గతేడాది కాలం నుంచి టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు జనం మద్ధతు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలని నిర్వహిస్తూ..దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎక్కడకు వెళ్ళిన బాబు  రోడ్ షోలకు భారీ ఎత్తున జనం వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మచిలీపట్నంకు బాబు వెళ్లారు.

జనం మద్దతు ఊహించని స్థాయిలో వచ్చింది. అసలు మచిలీపట్నంలో రోడ్ షో ద్వారా మీటింగ్ పెట్టాల్సిన సమయం సాయంత్రం 6..కానీ బాబు సభా ప్రాంగణంకు వచ్చేసరికి రాత్రి 11 గంటలు అయింది. విజయవాడ నుంచి రావడానికి దాదాపు 8 గంటల వరకు పట్టేసింది..అంటే విజయవాడ నుంచి మచిలీపట్నంకు మామూలుగా 2 గంటల సమయమే. కానీ బాబు రోడ్ షోకు జనం అడుగడుగున వచ్చారు. ఊహించని స్థాయిలో జనం రావడంతో టి‌డి‌పి శ్రేణుల్లో జోష్ నెలకొంది.

ఇక రాత్రి 11 గంటలకు సభ  మొదలైన..అప్పటికి జనం నిలబడ్డారు. బట్టి చూస్తే బాబుకు జనం మద్ధతు పెరిగిందని, ఆయనని సి‌ఎంగా చూడాలని జనం గట్టిగా కోరుకుంటున్నట్లే కనిపిస్తుంది. ఇక బాబు ఎంట్రీతో బందరులో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది. ఇప్పటికే అక్కడ టి‌డి‌పి బలం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు బాబు ఎఫెక్ట్ తో మరింత బలం పెరిగిందనే చెప్పవచ్చు.

అక్కడ టి‌డి‌పి ఇంచార్జ్‌గా ఉన్న కొల్లు రవీంద్రకు బాబు పర్యటన బాగా కలిసొస్తుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతోనే ఓడిపోయినా సరే..ఈ సారి మాత్రం కొల్లు గెలవడం ఖాయమని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి బందరులో మళ్ళీ టి‌డి‌పి జెండా ఎగిరే ఛాన్స్ ఉంది.