అనుష్క శెట్టి జాతకం వల్లే అమెకు వివాహం కాలేదా..?

టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ ఈమె వివాహం చేసుకోకుండా ఉండడంతో అభిమానులు వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. అయితే కొంతమంది వివాహం కోసం పూజలు, హోమాలు కూడా వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి దోషాలను ఎక్కువగా సినీ ఇండస్ట్రీలోని ఉండేవారే నమ్ముతూ ఉంటారు. కొంతమంది దోషాలను కూడా ఉంటాయని వాటిని తొలగించుకోవడానికి పలు దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు.

Anushka Shetty As Devsena Exude All The Beauty At Its Best, view pics |  IWMBuzz

ఇప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి జాతకంలో కూడా అటువంటి దోషమే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ప్రేక్షకులు అనుష్క పేరుని అసలు పట్టించుకోవడం లేదు. మొదట సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తన అందంతో గ్లామర్ తో కూడా కుర్రకారులను తన వైపు తిప్పుకుంది.ఆ తర్వాత సినీ కెరియర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఈమె నటించిన అరుంధతి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళంలో కూడా అడుగుపెట్టి పలు సినిమాలలో నటించింది.

అలా వరుసగా బాహుబలి 1,2 చిత్రాలతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందింది.. అయితే ఆ తర్వాత నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలన్నీ తీవ్రమైన నిరాశల మిగిల్చాయి. దీంతో అవకాశాలు కూడా రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క శెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.. అలాంటి సమయంలోనే నవీన్ పోలిశెట్టితో ఈమె ఒక సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించింది. వివాహ విషయంలో ఎన్నోసార్లు ఈమెను ఎన్నో ప్రశ్నలు అడగడం జరిగింది.. కానీ సెటిల్ అయ్యే వరకు ఈమె వివాహం చేసుకోనని తెలియజేస్తూ ఉండేది.

గతంలో ప్రభాస్ ను కూడా పెళ్లి చేసుకుంటోంది అంటూ వార్తలు వినిపించాయి.. అసలు విషయంలోకి వెళ్తే అనుష్క జాతకంలో ఒక పెద్ద దోషం ఉందట.ఆ దోషానికి పరిహారాలు చేసినప్పటికీ ఆమె జీవితంలో కోల్పోలేని దెబ్బ తినాల్సి వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అనుష్క లైఫ్ లో వచ్చే అబ్బాయి కూడా హ్యాపీగా ఉండాలని తన వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని ఆలోచిస్తూ వివాహ విషయాన్ని దూరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో చూడాలి మరి.