వై నాట్ పులివెందుల..బాబు రివర్స్ కౌంటర్.. వర్కౌట్ అవుతుందా?

వచ్చే ఎన్నికల్లో గెలుపుని సొంతం చేసుకుని అధికారం దక్కించుకోవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ..మరొకసారి అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఇటు టి‌డి‌పి ఈ సారైనా అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో రెండు పార్టీలు ప్రత్యేక వ్యూహంతో వెళుతున్నాయి. జగన్ ఏమో వై నాట్ 175 అని నినాదంతో ముందుకెళుతూ..దమ్ముంటే టి‌డి‌పి 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు.

దానికి చంద్రబాబు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో వైసీపీకి ఎందుకు చెప్పాలని అంటున్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో కాదని, 175 సీట్లలో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని బాబు అంటున్నారు. తాజాగా విశాఖ జోనల్ సదస్సులో ఆయన వైసీపీ టార్గెట్ గా  ఫైర్ అయ్యారు. అలాగే వై నాట్ 175 కాదు..వై నాట్ పులివెందులని..పులివెందులతో సహ అన్నీ స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ గెలిచే అవకాశమే లేదని, ఈ ప్రభుత్వానికి ఎక్సైపైరీ టైం వచ్చిందని, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మైండ్ బ్లాక్ అయ్యి…ఇప్పుడు ఎమ్మెల్యేలను గౌరవిస్తా అంటున్నాడన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో తిరుగుబాటు…..వచ్చే ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు అవుతుందని, తాము 175 పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలని, తాము 175లో వైసీపీని ఓడిస్తామని, పులివెందులలో కూడా జగన్ ను ఓడిస్తామని అన్నారు.

అయితే అటు జగన్ అందుకున్న వై నాట్ 175 నినాదం వర్కౌట్ అవ్వదు..ఇటు బాబు అందుకున్న వై నాట్ పులివెందుల వర్కౌట్ అవ్వదు. కాకపోతే ప్రత్యర్ధులని దెబ్బతీయడానికే ఇదో రకమైన ఎత్తు అని చెప్పవచ్చు.