గొప్ప మ‌న‌సు చాటుకున్న రానా భార్య‌.. ఏం చేసిందో తెలిస్తే శ‌భాష్ అంటారు!

ద‌గ్గుబాటి వారి కోడ‌లు, రానా స‌తీమ‌ణి మిహీకా ప్రెగ్నెంట్ అంటూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో పొట్ట కాస్త ఎత్తుగా క‌నిపించ‌డంగా.. మిహీకా గ‌ర్భం దాల్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలోనూ ఇలాంటి వార్త‌లే రాగా.. వాటిని మిహీకా ఖండించింది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మిహీకా తాజాగా త‌న గొప్ప మ‌న‌సును చాటుకుంది. ఆమె చేసిన ప‌నికి నెటిజ‌న్ల శ‌భాష్ అంటూ మిహీకాను పొగిడేస్తున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పేద వారి కోసం మిహీకా ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో ఆర్గనైజేషన్ తో కలసి కొన్ని కార్యక్రమాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో పేద వారి కోసం సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్ పంపిణి చేస్తున్నారు. భార‌తదేశంలో ఇప్పటికి ఎలక్ట్రిసిటీ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ గ్రామాల్లో రాత్రి వేళల్లో తమ పనులు చేసుకునేందుకు అవస్థలు పడకుండా మిహీకా సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ లైట్స్ పేద వారి ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతోంది. ఈ విష‌యాన్ని మెహీకా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకోవ‌డంతో.. నెటిజ‌న్లు ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CqPfRsMI0c3/?utm_source=ig_web_copy_link